వైసీపీకి రివర్స్ కొడుతున్న బొత్స లీకులు

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా యాక్టివ్ గా ఉండే మంత్రులలో బొత్స సత్యనారాయణ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.మిగిలిన మంత్రులు కూడా మాట్లాడుతూ విపక్షాల మీద విమర్శలు చేస్తున్న బొత్స పాత్ర మాత్రం ప్రత్యేకంగా ఉంటుందని చెప్పాలి.

 Jagan Face Negative Waves With Botsa Satyanarayana Political Leaks-TeluguStop.com

వైసీపీ ప్రభుత్వం తీసుకునే కొత్త మార్పులకి సంబందించిన ముందుగా బొత్స నుంచి లీకులు వస్తున్నాయి.తరువాత బొత్స అన్న మాటలు ప్రకారమే ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు ఉంటున్నాయి.

ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి బొత్స లీకుల పరంపర మొదలవుతుంది.

ప్రజా వేదిక కూల్చివేతపై ముందుగా బొత్స దాని అవసరం ఏమీ లేదనే విధంగా లీకులు ఇచ్చారు.

దాని ప్రకారమే ప్రజా వేదిక కూల్చేసారు.అమరావాతి ప్రాంతానికి ముంపు ముప్పు ఉందని, ఇక్కడ రాజధాని నిర్మాణం అనేది ఆలోచన లేని పని అంటూ బొత్స సత్తిబాబు లీకులు ఇవ్వడం మొదలెట్టారు.

దాని ప్రకారమే ఎన్నడూ లేని విధంగా అమరావతిలో కొన్ని ప్రాంతాలు ముంపుకి గురయ్యాయి.దీనిని అడ్డు పెట్టుకొని అమరావతిలో పరిపాలన చేయడానికి కావాల్సిన సౌకర్యాలు ఏమీ లేవని, రాజధానిని తరలించే అవకాశాలు ఉన్నాయనే విధంగా లీకులు ఇచ్చారు.

తరువాత జగన్ అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానులపై నిర్ణయం తీసుకున్నారు.ఇప్పుడు వైసీపీ ఎన్డీఏ కూటమిలో చేరబోతుంది, చిరంజీవి పార్టీలో చేరితే ఆహ్వానిస్తాం అంటూ జగన్ తీసుకోవాలని అనుకుంటున్నా నిర్ణయాల మీద లీకులు ఇస్తున్నాడు.

అయితే ఈ లీకులు ప్రజలని మానసికంగా ముందే సిద్ధం చేయడానికి ఉపయోగపడతాయని జగన్ భావిస్తున్న.అవే ఇప్పుడు ప్రజలలో అసహనం పెరిగేలా చేస్తూ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరగడానికి కారణం అవుతున్నాయనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube