జనాలకు జగన్ ఏం గుర్తుచేయబోతున్నారు ? 

పైకి కనిపించకపోయినా, ఏపీ సీఎం జగన్ లో అసంతృప్తి ఆందోళనగా కనిపిస్తున్నాయి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ ముఖ్యమంత్రి చేయని అంత స్థాయిలో అభివృద్ధి సంక్షేమ పథకాలను జనాలకు అందించినా, కనివిని ఎరుగని రీతిలో ఏపీ ని అభివృద్ధి చేసినా, ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజల కళ్లలో ఆనందం కలిగేలా చేసినా, అనుకున్న స్థాయిలో తనకు కానీ, ప్రభుత్వానికి కానీ ఆ ప్రతిఫలం దక్కకపోవడం జగన్ కు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది.

 Jagan, Ysrcp, Ap, Tdp, Chandrababu, Elections, Panchayathi, Janasena,navaratnalu-TeluguStop.com

తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచే ఎన్నో సంక్షేమ పథకాల అమలుకు జగన్ శ్రీకారం చుట్టారు.

వృద్ధులు , వికలాంగులు, నిరుద్యోగులు మహిళలు, పేద మధ్యతరగతి ఇలా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి చూపించారు.

వాటికి వేల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి.అయినా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వాటిని అమలు చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు.అయినా ఆ క్రెడిట్ జనాల నుంచి తనకు దక్కడం లేదని , పైగా చిన్న చిన్న విషయాల పై ప్రతిపక్షాల విమర్శలు , ఆరోపణలు జనాల్లోకి వెళ్లడం కారణంగా ప్రభుత్వం అభాసుపాలు కావాల్సి వస్తోందని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రతి పథకాన్ని వారి గుమ్మంలోకి అందించే ఏర్పాటు చేసినా, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చినా, జనాల్లో పెద్దగా స్పందన కనిపించడం లేదని,  ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో క్రెడిట్ దక్కడంతో లేదనేది జగన్ బాధ గా కనిపిస్తోంది.

Telugu Chandrababu, Jagan, Jaganwelfare, Janasena, Navaratnalu, Panchayathi, Ysr

రస్తుతం పంచాయతీ ఎన్నికలలో వైసీపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున గెలిచినా, జనసేన వంటి పార్టీలు పుంజుకోవడం జగన్ కు తీవ్ర నిరాశ కలిగిస్తుంది.అందుకే గత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి ప్రజల్లోకి పూర్తిగా తీసుకువెళ్లాలని, వీటిపై పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాలని , లబ్ధిదారులకు ఏవిధంగా మేలు జరుగుతోంది అనే విషయాలను పూర్తిగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని, గత టీడీపీ ప్రభుత్వం ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని జగన్ పార్టీ నేతలకు,  అధికారులకు హితబోధ చేశారట.ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రికార్డు స్థాయిలో పథకాలను అమలు చేసి చూపించినా,  దానికి జరగాల్సిన ప్రచారం జరగకపోవడంతో వైసీపీ ఇంతగా నష్టపోయింది అనే విషయాన్ని జగన్ గుర్తించి కాస్త లేట్ అయినా నష్టనివరణ చర్యలకు దిగినట్టు గా కనిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube