ఇక వృథా కాదు... కోతలే ! జగన్ డిసైడ్ అయిపోయారు ?

ఏపీ సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.అసలు జగన్ ఇన్ని సంక్షేమ పథకాలను ఇంత తక్కువ సమయంలో ఏ విధంగా అమలు చేసి చూపిస్తున్నారు ? వీటికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ? అసలు ఇంత భారీ భారీ బడ్జెట్ తో పథకాలను సక్రమంగా అమలు చేయాలంటే ఆషామాషీ కాదు అని , ధైర్యం ఉండాలని అంతా జగన్ విషయంలో అభిప్రాయపడుతున్నారు.ఇక చాలా రాష్ట్రాలు జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను స్ఫూర్తిగా తీసుకుని ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేసి చూపిస్తున్నాయి.ఈ విధంగా జగన్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు.
  ఒక దశలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం జగన్ అమలు చేస్తున్న పథకాలకు కితాబు ఇచ్చారు.నిజంగానే జగన్ ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేస్తూ, అమలు చేస్తున్న పథకాల పై ప్రశంసలు కాదు ,విమర్శలు ఉన్నాయి.

 Ap Cm Jagan Decided To Avoid Ineligible People From Welfare Schemes , Ap Cm Jaga-TeluguStop.com

అర్హులు అనర్హులు అని తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, ఇందులో వృధానే ఎక్కువ అవుతోందని అనేక ఫిర్యాదులు విమర్శలు వస్తూనే ఉన్నాయి.దీంతో జగన్ సైతం ఈ విషయంలో సీరియస్ గా నే ఉన్నారు.

ఎందుకంటే ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలకు సొమ్ముల అప్పుల రూపంలోనే వస్తున్నాయి.అప్పు చేసి పప్పు కూడు అన్నట్లుగా జగన్ పరిపాలన ఎలా ఉంది అనే విమర్శలు పెరిగిపోవడంతో, త్వరలోనే అనవసర ఖర్చులు తగ్గిస్తారట.

Telugu Ap Budget, Ap Cm Jagan, Ap, Schemes, Ineligible, Jagan, Navarathnalu, Tir

  ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో అనర్హులు ఉంటే ,వారందర్నీ పూర్తిగా ఏరి వేయాలని, పూర్తిగా అర్హులకు మాత్రమే సంక్షేమ పథకాలు అమలు చేసి విమర్శల నుంచి తప్పించుకోవడం తో పాటు, ఆర్థిక భారం తగ్గించు కోవాలని జగన్ చూస్తున్నారట.ప్రస్తుతం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను ప్రక్షాళన చేసి పూర్తిగా అర్హులకు మాత్రమే ఆ పథకాలు అందే విధంగా జగన్ చర్యలు తీసుకోబోతున్నారట.అంటే అన్ని రకాల సంక్షేమ పథకాలు ఓకే కుటుంబంలోని వ్యక్తులకు అందకుండా,  జగన్ పగడ్బంది చర్యలతో ముందుకు వెళ్లే విధంగా కనిపిస్తున్నారు.కాకపోతే జగన్ ఈ ప్రక్షాళన వెంటనే అమలు చేయరట.

తిరుపతి ఉప ఎన్నికలు ముగిసిన అనంతరం వీటిపై దృష్టిపెట్టి అర్హులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube