కేంద్రం తరఫున జగన్ వకాల్తా :విపక్షాలు వింటాయా?

కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం పై మొదలైన రగడ కొనసాగుతుంది .ఈనెల 28న కొత్త పార్లమెంట్ ప్రారంభించబోతున్నారు ప్రధాని మోదీ( Narendra Modi ) .

 Jagan Confirmed His Attendance In Parliament Opening Ceremony ,  Ys  Jagan ,  Pa-TeluguStop.com

అయితే ప్రధాని చేతుల మీదుగా కాకుండా రాష్ట్రపతి చేతుల మీదుగా పార్లమెంటు భవనం ప్రారంభించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.ఒకవేళ ప్రధాని తమ విన్నపాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళితే పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని కూడా దాదాపు 20 విపక్షాల కూటమి నిర్ణయించింది .ఇప్పుడు విపక్షాల నిర్ణయం పై అసంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి జగన్( YS Jagan Mohan Reddy ).కేంద్రం తరఫున ఆయన వకాల్తా పుచ్చుకున్నట్లుగా ఆయన ట్విట్టర్ వేదికగా కొన్ని వ్యాఖ్యలు చేశారు.నూతన పార్లమెంట్ భవనంపై ఆయన ట్విట్టర్ వేదికగా ట్విట్ చేశారు .ఇది రాజకీయ విభేదాలను చర్చించుకోవాల్సిన సమయం కాదని ,దేశ ప్రజాస్వామ్యంలో ఒక మహత్తర కార్యక్రమమని ఇలాంటి కార్యక్రమానికి నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తితో తాము హాజరవుతున్నామని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేయబోతున్న ప్రధాన మోడీకి కూడా సీఎం జగన్ అభినందనలు తెలియజేశారు .

Telugu Chandra Babu, Jagan, Janasena, Narendra Modi, Ceremony, Pawan Kalyan-Telu

దేశం యొక్క ఆత్మను ప్రతిబింబించే ఇలాంటి మహత్తర కార్యక్రమానికి గైర్హాజరవ్వటం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదని ,రాజకీయ విభేదాలు అన్ని పక్కన పెట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మిగతా పార్టీలను కూడా ఆయన కోరారు .రాజకీయాలను తర్వాత చూసుకోవచ్చని ఇలాంటి కార్యక్రమానికి హాజరవలసిన బాధ్యత అన్ని పార్టీలపై ఉంటుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి .

Telugu Chandra Babu, Jagan, Janasena, Narendra Modi, Ceremony, Pawan Kalyan-Telu

భాజాపాతో జగన్ కు విభేదాలు ఉన్నాయని ఈమధ్య విపరీతంగా తెలుగు మీడియాలో ప్రచారం అవుతుంది.మోడీ జగన్ ను దూరం పెట్టారని, ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేవని వరుస కథనాలు ఈ మధ్య ప్రసారమయ్యాయి.ఇప్పుడు పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి హాజరవడం మాత్రమే కాక కేంద్రం తరపున విపక్షాలను ఒప్పించే ప్రయత్నం చేయడం ద్వారా కూడా అవన్నీ కేవలం మీడియా సృష్టేనని నిరూపించాలని జగన్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది .మరి జగన్ రిక్వెస్ట్ పై ప్రతిపక్షాల స్పందన ఏరకంగా ఉంటుందో చూడాలి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube