గంటాకు జగన్ పెట్టిన కండిషన్ ఏంటి ?  

YS jagan Condition to Ganta Srinivasa Rao, Ganta Srinivasa Rao, TDP MLAs, Chandrababu, YS Jagan, Ganta YCP Party - Telugu Chandrababu, Ganta Srinivasa Rao, Ganta Ycp Party, Tdp Mla\\'s, Ys Jagan, Ys Jagan Condition To Ganta Srinivasa Rao

విశాఖ రాజకీయాల్లో బలమైన నాయకుడిగా, మంచి రాజకీయ విశ్లేషకుడుగా గుర్తింపు పొందిన టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజకీయ ప్రస్థానం గందరగోళంగానే కనిపిస్తోంది.ఆయన ఎప్పటి నుంచో వైసీపీలో చేరబోతున్నారు అంటూ ఎప్పటికప్పుడు జరుగుతుండడం పెద్ద ఎత్తున మీడియాలో హైలెట్ అవ్వడం, ఇలా ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

TeluguStop.com - Jagan Condition Ganta Srinivasa Rao Ycp

కానీ గంటా మాత్రం పార్టీ మారే విషయంలో ఎవరికి ఏ క్లారిటీ రావడం లేదు.కానీ తెరవెనుక తాను నడపాల్సిన తతంగమంతా నడిపిస్తున్నారు.

అసలు ఎన్నికలకు ముందే ఆయన వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగినా, అది సాధ్యం కాలేదు.

TeluguStop.com - గంటాకు జగన్ పెట్టిన కండిషన్ ఏంటి -Political-Telugu Tollywood Photo Image

పోనీ టిడిపిలో అయినా నమ్మకం గా ఉంటున్నారు అంటే, ఆ పార్టీలోనూ, చాలా కాలంగా అసంతృప్తిగానే ఉంటున్నారు.

పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. వైసీపీలో చేరే విషయం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అడ్డుకోవడంతో, ఆయన చేరిక ఆలస్యమవుతోందని, గంటాను చేర్చుకుంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైసీపీకి మరింత బలం చేకూరుతుందని జగన్ నమ్ముతున్నారు.

ఇదిలా ఉంటే గంటా వైసీపీలో చేరే విషయమై జగన్ ఓ కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.వైసీపీలో చేరాలనుకుంటే మరో ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని రావాలని చెప్పడంతో, గంటా చేరిక ఆలస్యమవుతోందట.

అసలు విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఇద్దరితో కలిసి గంటా వైసీపీ జెండా పట్టుకోవాలని భావించినా, అది సాధ్యపడలేదు.అయితే వాసుపల్లి గణేష్ వైసీపీలో చేరడానికి గంటాను , మరో ఎమ్మెల్యేను చేర్చడంతో పాటు, ముఖ్యమైన కార్యకర్తలు అందరినీ వైసీపీ లోకి పంపించి, ఆ తరువాత తాను వైసీపీ కండువా కప్పుకోవాలని గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటి వరకు గంట చేరికను అడ్డుకుంటూ వచ్చిన విజయసాయిరెడ్డి ఇప్పుడు ఏ లిటిగేషన్ పెడతాడో అనే టెన్షన్ గంటా అనుచరవర్గంలోనూ ఉంది.

#Ganta YCP Party #YSJagan #Chandrababu #Tdp Mla's #GantaSrinivasa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jagan Condition Ganta Srinivasa Rao Ycp Related Telugu News,Photos/Pics,Images..