ముదిరిన డేటా చోరీ వ్యవహారం! గవర్నర్ కి జగన్ ఫిర్యాదు!

ఏపీలో ఓట్ల తొలగింపుకి పాల్పడటం, అలాగే ప్రజల వ్యక్తిగత సమాచారం దొంగిలించడం వంటి నేరాల క్రింద తెలంగాణలో ఐటీ గ్రిడ్స్ అనే సంస్థ మీద తెలంగాణ పోలీసులు యాక్షన్ తీసుకున్న సంగతి తెలిసిందే.దీంతో తమ ప్రభుత్వ కోసం పని చేస్తున్న ఐటీ కంపెనీపై తెలంగాణ జోక్యం ఏంటి అంటూ చంద్రబాబు గొడవ మొదలెట్టారు.

 Jagan Complaints To Governor Against Chandrababu-TeluguStop.com

అలాగే వైసీపీ పార్టీ ఓటర్స్ డేటా దొంగిలించి తెలుగు దేశం సానుభూతిపరుల ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అని టీడీపీ ఆరోపిస్తుంది.ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఏపీ రాజకీయాలు వేడెక్కి వున్నాయి.

ఇదిలా వుంటే రెండు పార్టీల మధ్య ఈ రాజకీయ వేడి మరింత రాజుకుంటున్నట్లు కనిపిస్తుంది.డేటా చోరీ, ఓట్ల తొలగింపుపై టీడీపీ మీద గవర్నర్ కి వైసీపీ అధినేత జగన్ ఫిర్యాదు చేసారు.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేసారు.తెలుగుదేశం పార్టీ అతిపెద్ద సైబర్ క్రైమ్ కి పాల్పడింది అని ఆరోపించారు.

ఇక టీడీపీ మరో వైపు తెలంగాణ ప్రభుత్వం డేటా చోరీ కేసు పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది.అవసరం అయితే తాము కూడా గవర్నర్ ని కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

మరి రెండు పార్టీల మధ్య ఈ రాజకీయ వేడికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube