నీ ఐదుగురు పిల్లలు ఏ మీడియం లో చదువుతున్నారు పవన్ ? జగన్ సూటి ప్రశ్న

ఇప్పటివరకు విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎక్కడా ప్రతి విమర్శ చేయలేదు.కేవలం వైసీపీ నాయకులు, మంత్రులు, శాసనసభ్యులు మాత్రమే ప్రతిపక్షల విమర్శలను తిప్పికొడుతూ వచ్చారు.

 Jagan Comentson Pavan Kalyan-TeluguStop.com

అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.అసలు మీరు ఏం చేస్తున్నారో అర్ధం అవుతుందా తెలుగు భాషను చంపేస్తారా అంటూ ఆవేశంగా విమర్శలు చేస్తున్నారు.

అయితే ప్రతిపక్షాలు మరింత ఎదురు దాడికి దిగడంతో జగన్ నేరుగా రంగంలోకి దిగిపోయారు.

జాతీయ విద్యాదినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్‌‌లో అబుల్‌ కలాం విద్యా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది.

ఈ వేడుకల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ ప్రవేశపెట్టడంపై వస్తున్న విమర్శలకు ఘాటుగా సమాధానం చెప్పారు జగన్.“పేదలు కూడా రాణించాలంటే ఇంగ్లీషు మీడియం చదువులు ముఖ్యం.ఇంగ్లీష్ రాకుంటే ప్రపంచంలో మన వాళ్లు పోటీ పడలేరు.

ప్రభుత్వ పాఠశాలల్లో వారం రోజుల క్రితం జీవో ఇచ్చాం.చంద్రబాబు, వెంకయ్య నాయుడు, పవన్ కళ్యాణ్ వంటి వారి నోళ్లు తెరచుకున్నాయి.

మన పిల్లలకు మంచి చేస్తే విమర్శలు ఎందుకు ? ఇటువంటి మాటలు మాట్లాడేవారు ఒకసారి ఆలోచన చేయాలి.

మీ కొడుకులు, మనవళ్లు ఏ మీడియంలో‌ చదువుతున్నారు.

ఇంగ్లీష్‌ మీడియాన్ని వ్యతిరేకించేవారు వారి పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారు, రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవళ్లు ఏ స్కూల్‌లో చదువుతున్నారో చెప్పాలి, అలాగే పవన్ భార్యలకు ఐదుగురు పిల్లలు ఉన్నారు.వాళ్లు ఏ స్కూల్లో చదువుతున్నారు అంటూ కౌంటర్ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube