కౌంటర్: బాబు అత్తగారికి పదవి ఇచ్చామన్న జగన్

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్ష విపక్షాల మధ్య వాడి వేడి చర్చలే కాకుండా మధ్య మధ్య లో కొన్నికొన్ని చర్చలు సభ్యుల మధ్య నవ్వులు పూయిస్తున్నాయి.తాజాగా అటువంటి సంఘటనే నేటి అసెంబ్లీ సమావేశాల్లో చోటు చేసుకుంది.

 Jagan Clarity On Nominated Posts-TeluguStop.com

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై అసెంబ్లీలో అధికార వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరిగింది.సలహాదారులు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ విషయంలో ఒకే సామజిక వర్గానికి చెందిన వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారంటూ తెలుగుదేశం పారుతీకి చెందిన ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపణలు చేశారు.

రాష్ట్ర బడ్జెట్ లోటులో ఉండగా రాష్ట్రానికి ఇంత మంది సలహాదారులు అవసరమా అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.

గతంలో డీఎస్పీల పదోన్నతులపై కూడా వైసీపీ రాజకీయం చేసింది అంటూ అనగాని గుర్తుచేశారు.

దీనిపై స్పందించిన జగన్ వక్రీకరణ చేయడంలో తెలుగుదేశం పార్టీని మించినవారు ఎవరూ లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.నామినేటెడ్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన రాష్ట్రం ఏపీ మాత్రమేనని జగన్‌ గుర్తుచేశారు.

తెలుగు అకాడమీ చైర్మన్‌గా చంద్రబాబు అత్తగారైన లక్ష్మీపార్వతిని నియమించామని జగన్‌ చెప్పారు.ఆమెకు పదవిని మీరివ్వలేకపోయారని, మేం ఇచ్చామని జగన్ వ్యాఖ్యానించడంతో చంద్రబాబు తో సహా మిగతా అందరి సభ్యుల ముఖాల్లో నవ్వులు కనిపించాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube