వీళ్ల 'స్టార్' జగన్ మారుస్తాడా ?  

Jagan Change The Cinema Comedians Life-

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో సినిమా స్టార్ ల సందడి ఎక్కువగా ఉండేది.టీడీపీకి సంబంధించి ఏ కార్యక్రమం అయినా, ఎన్నికల ప్రచారం అయినా పెద్ద సంఖ్యలో సినిమా ఫీల్డ్ కి సంబందించినవారు వాలిపోతుండేవారు.టీడీపీని స్థాపించిందే సినిమా రంగంలో ఎవర్ గ్రీన్ గా నిలిచినా ఎన్టీఆర్ కావడంతో స్వతహాగా ఆ ప్రభావం టీడీపీలో ఎక్కువ కనిపించేది...

Jagan Change The Cinema Comedians Life--Jagan Change The Cinema Comedians Life-

అయితే గత కొద్ది కాలంగా టీడీపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీకి దూరమై వైసీపీ వైపు ఆకర్షితులైన వారు చాలామందే ఉన్నారు.ఒకరకంగా చెప్పాలంటే టీడీపీలో 90 శాతం సినీ గ్లామర్ తగ్గిపోయిందనే చెప్పాలి.ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ కోసం కష్టపడ్డ సినీ జనాలు తమకు సరైన ప్రతిఫలం దక్కుతుందేమో అన్న ఆశలో ఉన్నారు.

Jagan Change The Cinema Comedians Life--Jagan Change The Cinema Comedians Life-

పోసాని కృష్ణ మురళి, థర్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ ఫృథ్వీ అయితే కాస్త గట్టిగానే ప్రచారం చేశారు.పృథ్వీ జగన్ గెలవాలని గుండు కూడా కొట్టించుకొచ్చాడు.

పార్టీ టికెట్ రాదని తెలిసినా, స్నేహితుడు పవన్ కల్యాణ్ ఫీలవుతాడని ఊహించినా అలీ ఖాతరు చేయలేదు.జగన్ పార్టీలోకి జంప్ అయ్యాడు.చివరి నిమిషంలో జీవిత, రాజశేఖర్ వైసీపీలో కి వచ్చేసి జగన్ మీద ప్రశంసల వర్షం కురిపించేసారు..

సినిమా అవకాశాలు పెద్దగా లేని చిన్ని కృష్ణ కూడా ఫ్యాను పార్టీ ఫ్యాన్ అయిపోయాడు.ఇలా చెప్పుకుంటూ పోతే సినీ జనాలు ఎక్కువ సంఖ్యలో జగన్ జపం చేసినవారే.

ఇప్పుడు కానీ విని ఎరగని రీతిలో వైసీపీ అధికారంలోకి రావడంతో వీరిలో కొత్త ఆశలు చిగుర్లు తొడిగాయి.

తమకు ఎలాగూ శాసనసభ అభ్యర్థిత్వం దక్కలేదు కాబట్టి కీలకమైన నామినేటెడ్ పోస్ట్స్ దక్కుతాయని వీరంతా గంపెడు ఆశతో ఉన్నారు.వీరిలో మరీ ముక్యక్యంగా పెద్ద పెద్ద పదవుల మీద ఆశలు పెట్టుకున్నవారిలో పోసాని, పృద్వి కనిపిస్తున్నారు.తమకు ఏదైనా మంచి పోస్ట్ దక్కుతుందనే ఉద్దేశంతో ఎక్కువగా వైసీపీ కీలక నాయకులతో టచ్ లోకి వెళ్తున్నారు.

వీలైతే రాజ్యసభ అభ్యర్థిత్వం కూడా ఇస్తే మంచిదన్నట్టుగా వీరు భావిస్తున్నారు.వీరే కాకుండా మిగతా సినీ పెద్దలు కొంతమంది జగన్ తో టచ్ లోకి వెళ్తున్నారు.వీరి విషయంలో జగన్ ఏ విధంగా స్పందిస్తారో .

వీరి స్టార్ ఏ విధంగా మారుస్తారో చూడాలి.