సుప్రీం నిర్ణయంతో జగన్ కే వణుకా ? బాబుకి లేదా ?  

jagan chandrababu tention on supreme court desistion, Jagan, AP Cm, Chandrababu, AP High Court, Supreme Court, TDP, Jagan Illigal Properties - Telugu Ap Cm, Ap High Court, Chandrababu, Jagan, Jagan Illigal Properties, Supreme Court, Tdp

రాజకీయ నాయకులు అందరికీ దిమ్మతిరిగిపోయే విధంగా సుప్రీం కోర్టు ముందుకు వెళ్తోంది.ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న నేరచరితుల అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

TeluguStop.com - Jagan Chandrababu Tention On Suprem Court Desistion

కానీ ఈ విషయంలో ఏ కదలికా లేకుండా ఉంది.తాజాగా సుప్రీంకోర్టు ఈ విషయంపై దృష్టిపెట్టింది.

రాజకీయాల్లో ఉన్న నేర చరిత్ర ఉన్న నాయకులపై నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది.దీనికి సంబంధించిన కసరత్తు కూడా మొదలు పెట్టింది.

TeluguStop.com - సుప్రీం నిర్ణయంతో జగన్ కే వణుకా బాబుకి లేదా -Political-Telugu Tollywood Photo Image

రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.దీనికి సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేసి వారం రోజుల్లో పంపించాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కలకలం రేగింది.

ముఖ్యంగా నేర చరిత ఉన్న రాజకీయ నాయకుల అంశంలో సుప్రీం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియక అంతా ఆందోళనలో ఉన్నారు.

ఇక ఏపీ విషయానికి వస్తే, సీఎం జగన్ పై అక్రమాస్తుల కేసుతో పాటు మరెన్నో కేసులు పెండింగ్ లో ఉన్నాయి.అంతే కాదు అక్రమాస్తుల కేసులో పదహారు నెలల పాటు జైలు జీవితం కూడా గడిపారు.

దీంతో ఇక జగన్ జైలుకు వెళ్లడం తప్పదు అని, ఏపీ కొత్త సీఎం ఎవరు అంటూ తెలుగుదేశం పార్టీ అప్పుడే సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టింది.ఈ మేరకు ఆ పార్టీ సానుభూతిపరులు ఈ విషయాన్ని బాగా ట్రోల్ చేస్తున్నారు.

అయితే ఇక్కడ మరో చర్చ మొదలైంది.

అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న జగన్ కు మాత్రమే సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పుతో ఎదురుదెబ్బ తగులుతుందా ? మరి చంద్రబాబు సంగతేంటి అనే విషయం ఇప్పుడు వైసీపీ సైతం హైలెట్ చేస్తోంది.ఇప్పటికే చంద్రబాబు పై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే కేసు ఉంది.ఈ కేసును ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి ఎప్పుడో కోర్టులో పిటిషన్ వేశారు.కాకపోతే దీనిపై విచారణ ముందుకు వెళ్లకుండా చంద్రబాబు ఎప్పటికప్పుడు స్టే తెచ్చుకుంటూ వస్తున్నారు.ఇప్పుడు సుప్రీం కోర్టు నేర చరిత్ర ఉన్న రాజకీయ నాయకుల విషయంలో ఏదైనా కీలక నిర్ణయం తీసుకున్నా, అది జగన్ తో పాటు చంద్రబాబుకు వర్తిస్తుంది.

కానీ ఆ విషయాన్ని ఎక్కడా హైలెట్ చేయకుండా, జగన్ పైనే టీడీపీ ఫోకస్ చేసి విమర్శలు చేస్తోంది.

#Supreme Court #Jagan #JaganIlligal #AP Cm #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jagan Chandrababu Tention On Suprem Court Desistion Related Telugu News,Photos/Pics,Images..