నిన్న బేలతనం.. నేడు ధిక్కారం.. రేపు?

జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కోర్టుకు హాజరయ్యే సందర్భం కోసం మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే.ఎందుకంటే ఆయన ఈ శుక్రవారం కూడా సీబీఐ కోర్టు విచారణకు హాజరు కాలేదు.

 Jagan Casepost Pone In Next Month Sixth-TeluguStop.com

అధికారిక కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉండటం వల్ల రాలేకపోతున్నాను అని తన లాయర్ల ద్వారా కోర్టుకు సమాచారం పంపించారు.దీంతో కోర్టు విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది.

Telugu Apcm, Cbiangry, Jagan-Telugu Political News

అసలు ఏపీలో అధికారం చేపట్టినప్పటి నుంచీ జగన్‌ కోర్టుకు రావడం లేదు.సీఎం హోదాలో ప్రతి శుక్రవారం కోర్టుకు రావడం కుదరదని, పైగా వచ్చి వెళ్లేందుకు తన రక్షణ, రవాణా కోసం భారీగా ఖర్చవుతుందని, అందువల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్‌ కోర్టును కోరారు.దీనికోసమే ఆ మధ్య ఢిల్లీ వెళ్లి అమిత్‌ షాను కూడా కలిశారని వార్తలు వచ్చాయి.

అయితే జగన్‌కు మాత్రం భంగపాటు తప్పలేదు.

సీఎం అయినా సరే వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అని సీబీఐ కోర్టు తేల్చి చెప్పింది.కానీ ఆ ఆదేశాలు వెలువడిన తర్వాత కూడా జగన్‌ ఇప్పటి వరకూ కోర్టుకు రాలేదు.

దీంతో ఇది కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని సీబీఐ వాదిస్తోంది.మొదటి నుంచీ ఏవో కారణాలు చెప్పి విచారణను ఆలస్యం చేస్తున్నారని ఈ విచారణ సంస్థ ఆరోపిస్తోంది.

Telugu Apcm, Cbiangry, Jagan-Telugu Political News

ఇప్పుడు వ్యక్తిగతంగా హాజరు కాకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని, ఇలా అయితే విచారణను వేగవంతం చేయడానికి రోజువారీ హాజరును కూడా సీబీఐ కోరే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.కోర్టు కూడా ఇలాగే భావిస్తే మాత్రం జగన్‌కు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అప్పుడు ఆయన రోజూ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది.ఇలా కోర్టు ధిక్కరణకు పాల్పడటం సరి కాదని న్యాయ వర్గాల్లోనూ చర్చ నడుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube