కోడి కత్తి కేసు : రహస్య ప్రదేశానికి నిందితుడు !

విపక్ష నేత ,వైఎస్ ఆర్ కాంగ్రస్ అదినేత జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసు నిందితుడు జలపల్లి శ్రీనివాసరావును రహస్య ప్రదేశానికి తరలించాలని ఎన్.ఐ.

 Jagan Case Accused Srinivasarao In The Secret Place-TeluguStop.com

ఎ.అధికారులు భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.హైకోర్టు ఆదేశాల మేరకు ఈ విచారణ చేపట్టిన ఎన్.ఐ.ఎ.ఆదివారం నిందితుడి తరపు లాయర్‌ అబ్దుల్‌ సలీమ్‌ను విశాఖబక్కన్నపాలెం సీఆర్పీఎఫ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు రావాలని సూచించారు.అయితే ఇక్కడ అధికారులు ఎలాంటి విచారణ జరపలేదని న్యాయవాది సలీమ్‌ మీడియాకు తెలిపారు.

శ్రీనివాసరావును విచారించేందుకు బక్కన్నపాలెంలోని సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ సరైన ప్రాంతం కాదని అధికారులు అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు.అందువల్ల నిందితుడిని విచారణ కోసం మరో ప్రాంతానికి తరలించడానికి ఉన్నతాధికారుల అనుమతిని కోరారని పేర్కొన్నారు.అనుమతులు లభించిన వెంటనే శ్రీనివాసరావును హైదరాబాద్ లేదా మరో ప్రాంతానికి తరలిస్తారని స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube