జగన్‌ కేసులో నిందితుడు శ్రీనివాస్‌కు అస్వస్థత  

జగన్‌‌పై దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు ఆస్వస్థతకు గురయ్యాడు. దీంతో సిట్ బృందం అతన్ని కేజీహెచ్‌కు తరలించింది. శ్రీనివాస్‌ను పరీక్షించిన వైద్యులు.. అతను గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపారు. శ్రీనివాసరావు గుండెపోటుతో బాధపడుతున్నాడని, ట్రీట్‌మెంట్‌కు సహకరించడం లేదని డాక్టర్ దేముడు వెల్లడించారు. తనకు ట్రీట్‌మెంట్ వద్దని.. అవయవ దానం చేస్తానని శ్రీనివాస్ అంటున్నాడని డాక్టర్ దేముడు చెప్పారు. అంతేకాకుండా తాను ప్రజలతో మాట్లాడాలని గట్టిగా కేకలు పెడుతున్నాడని అన్నారు.

Jagan Case Accused-srinivasarao Effected Health Problem-

Jagan Case Accused-srinivasarao Effected Health Problem

ఎడమ చేయి బాగా నొప్పి వస్తుందని, ఛాతిలో దడగా ఉందని శ్రీనివాసరావు పోలీసులకు చెప్పడంతో వైద్యులకు సమాచారం అందించారు. ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి పరీక్షలు చేసిన వైద్యుల సూచనల మేరకు శ్రీనివాసరావును కేజీహెచ్‌కు తరలించారు. తన అవయవాలను దానం చేయాలంటూ నిందితుడు డాక్టర్లతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నట్టు సమాచారం. సమస్య ఏంటి అని అడిగితే.. నాకు వైద్యం కాదు.. అవయవ దానం చేయడానికి సహకరించాలంటూ వైద్యులతో శ్రీనివాసరావు చెప్పినట్టు తెలుస్తోంది. బీపీ, పల్స్‌ రేట్లు నార్మల్‌గానే ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో కేజీహెచ్‌ నుంచి నిందితుడు శ్రీనివాస్‌ను డిశ్చార్జ్‌ చేశారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్‌కు తరలించారు.