జగన్ ' రద్దు ' నిర్ణయాల వెనుక ఉంది ఆయనేనా ? 

ఎప్పటి నుంచో వివాదాస్పదంగా సంచలనం రేకెత్తిస్తున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్  ఆకస్మాత్తుగా రద్దుచేస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించారు.అసలు ఎప్పటి నుంచో దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా, దాదాపు అమరావతి రాజధాని అనే విషయం అంతా మర్చిపోతున్న సమయంలో జగన్ నిర్ణయం తీసుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

 Jagan Canceled The Three Capitals Bill On The Instructions Of Amit Shah Ap Cm Ja-TeluguStop.com

ఇప్పుడు అమరావతిని జగన్ రాజధానిగా ఒప్పుకున్నట్లేనా అని అంత సందిగ్ధం లో ఉండగానే , మరో కొత్త బిల్లుని మూడు రాజధానులు కోసం తీసుకువస్తాను అంటూ ప్రకటించారు.  అయితే ఇంత అకస్మాత్తుగా జగన్ తన నిర్ణయాన్ని ప్రకటించడం వెనుక ఎవరు సలహాలు-సూచనలు పనిచేశాయి అనేది ఆసక్తికరంగా మారింది.2019 డిసెంబర్ లో ఏపీకి మూడు రాజధానులు అంటూ జగన్ ప్రకటన చేయడం పై అమరావతి పరిసర ప్రాంతాల ప్రజలకు తీవ్ర ఆగ్రహం కలిగించింది.
      అమరావతి రాజధాని అంటూ టిడిపి ప్రభుత్వం ప్రకటించడంతో , తాము పెద్ద ఎత్తున భూములు త్యాగం చేశామని,  ఇప్పుడు మూడు రాజధానులు అంటూ ప్రకటన చేస్తే ఎలా అంటూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు ఆందోళనకు శ్రీకారం చుట్టారు.

అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ అప్పటి నుంచి ఆందోళనలు ఇప్పటివ రకు నిర్వహిస్తూ వస్తున్నారు.  ఇక మూడు రాజధానుల విషయమై అసెంబ్లీలో బిల్లు పాస్ కావడం, దానికి గవర్నర్ ఆమోదం తెలపడం జరిగిపోయాయి.

అలాగే సీఆర్డీఏ ను కూడా రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇదంతా చంద్రబాబు పై ఉన్న కోపం కారణంగానే చేస్తున్నారని జగన్ పై విమర్శలు వచ్చాయి.

విశాఖను పరిపాలన రాజధానిగా నిర్ణయించి అక్కడే అభివృద్ధి పనులు చేపడుతూ, పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండగానే,  కోర్టు వ్యవహారం కారణంగా జగన్ నిర్ణయం వాయిదా పడుతూ వస్తోంది. 

Telugu Amith Sha, Ap, Ap Cm Jagan, Central, Chandrababu, Ysrcp-Telugu Political

    కానీ రెండు రోజుల క్రితం అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ను రద్దు చేస్తున్నట్లు జగన్ ప్రకటించడంతో,  ఇంతకాలంగా ఉద్యమాలు చేస్తూ,  ఆందోళన నిర్వహిస్తున్న పట్టించుకోని  జగన్, మూడు రాజధానుల విషయాన్ని వదిలిపెట్టకుండా,  అమరావతి పక్కన పెట్టారని,  కానీ ఇంత అకస్మాత్తుగా నిర్ణయం ఎందుకు మార్చుకున్నారు అనే విషయం పై అందరికీ ఆసక్తి నెలకొంది.అయితే ఈ విషయంలో కేంద్ర బిజెపి పెద్దల సలహాలు , సూచనలు కారణంగానే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది .ముఖ్యంగా ఇటీవల తిరుపతి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జగన్ ప్రత్యేకంగా భేటీ అయిన సందర్భంగా మూడు రాజధానులు,  అమరావతి వ్యవహారంపై చర్చించారని , ఆయన సూచనల తోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది .సరిగ్గా అదే సమయంలో కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.కోర్టులో రాజధాని వ్యవహారం ఉండడంతో పాటు , అమిత్ షా ఇచ్చిన కొన్ని విలువైన సూచనలతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube