కేబినెట్ మార్పులో వారికే పెద్ద‌పీట వేయ‌నున్న జ‌గ‌న్..

Jagan Can That Are Administered In The Cabinet Change

వైసీపీలో మొద‌టి నుంచి జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు అంద‌రినీ ఆందోల‌న‌కు గురి చేస్తూనే ఉన్నాయి.ఇంకొన్ని సార్లు ఆశ్చ‌ర్యానికి కూడా గురి చేస్తున్నాయి.

 Jagan Can That Are Administered In The Cabinet Change-TeluguStop.com

ఇందులో మ‌రీ ముఖ్యంగా మంత్రి ప‌ద‌వుల విష‌యంలోనే వైసీపీ నేత‌లు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.ఆల్రెడీ మంత్రి ప‌ద‌వుల్లో ఉన్న వారికేమో ఎక్క‌డ త‌మ ప‌ద‌వి పోతుందేమో అన్న బాధ అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉన్న వారికేమో త‌మ‌కు మంత్రి ప‌ద‌వి రావాల‌నే ఆరాటం ఇలా ఎటు చూసినా అంతా గంద‌ర‌గోళంగానే మారుతోంది రాజ‌కీయం.

అయితే ఇలాంటి గంద‌ర‌గోళ రాజ‌కీయాల నేప‌థ్యంలో మొన్న అసెంబ్లీలో జ‌రిగిన ఘ‌ట‌న ఏపీ రాజ‌కీయాల‌ను కుదిపేసింద‌నే చెప్పాలి.చంద్ర‌బాబు ఫ్యామిలీ మీద అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌నే నింద‌ను వైసీపీ మూటగ‌ట్టుకుంది.

 Jagan Can That Are Administered In The Cabinet Change-కేబినెట్ మార్పులో వారికే పెద్ద‌పీట వేయ‌నున్న జ‌గ‌న్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో చంద్ర‌బాబు మీడియా ముందు క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిపోయింది.ఇక నందమూరి కుటుంబం కూడా కూడ‌గ‌ట్టుకుని చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ప‌ల‌కడం, అన్ని ర‌కాలుగా చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు పెరిగిపోవ‌డంతో దానికి అడ్డుక‌ట్ట వేయాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారంట‌.

Telugu @2019ysrcp, Ap Govt, Ap News, Ap Politics, Chnadra Babu, Cm Jagan, Jagan, Jagan Can That Are Administered In The Cabinet Change Jagan, Ycp, Ysrcp-Telugu Political News

ఇందులో భాగంగానే రాబోయే కేబినెట్ మార్పులో ఎక్కువ‌గా మహిళలకు పెద్ద పీట వేసి తాను మ‌హిల‌ల‌కు ఇస్తున్న గౌర‌వాన్ని చాటుకోవాల‌ని జ‌గ‌న్ చూస్తున్నారంట‌.ఇప్ప‌టికే జ‌గ‌న్ కేబినెట్ లో ముగ్గురు మహిళలు ఉన్నారు.అయితే వీరి సంఖ్య‌ను డ‌బుల్ చేస్తూ మ‌హిళ‌ల‌కు ఆరు మంత్రి ప‌దువులు ఇవ్వాల‌ని జ‌గ‌న్ డిసైడ్ అయ్యారంట‌.ఈ వార్త ఇప్పుడు వైసీపీలోని మహిళా ఎమ్మెల్యేల‌కు, ఎమ్మెల్సీల‌కు ఆనందాన్ని పంచుతోంది.

అయితే వారిలో ఎవ‌రికి ఇస్తార‌న్న‌ది మాత్రం ఇంకా ఫైన‌ల్ కాలేదు.ఒక‌వేళ ఈ నిర్ణ‌యాన్ని గ‌న‌క అమ‌లు చేస్తే మాత్రం మ‌హిల‌ల్లో వైసీపీకి ఆద‌ర‌ణ పెరుగుతుంద‌నే చెప్పాలి.

మ‌రి జ‌గ‌న్ ఇలాంటి వ్యూహాల‌ను అమ‌లు చేస్తారా లేదా అన్న‌ది చూడాలి.

#Jagan #@2019ysrcp #AP #Ysrcp #AP

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube