జగన్ సైలెన్స్ .. మంత్రులు వైలెన్స్  

Jagan Cabinet Ministers Comments On Tdp And Janasena Party-jagan Silent In Ycp Cabinet Ministers Issue,kodali Nani Comments On Devineni Umma,perni Nani,ycp Jagan Mohan Reddy

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి.ప్రభుత్వ పని తీరుపై ప్రతికూల, అనుకూల ఫలితాలు వస్తున్నాయి.అయితే ప్రస్తుతం జగన్ పూర్తిగా మారిపోయినట్టే కనిపిస్తోంది.గతంలో వైసిపి ప్రతిపక్షంలో ఉండగా అధికార పార్టీపై విరుచుకుపడుతూ కనిపించిన జగన్ పూర్తిగా మౌనంగా ఉండిపోతున్నారు.

Jagan Cabinet Ministers Comments On Tdp And Janasena Party-jagan Silent In Ycp Cabinet Ministers Issue,kodali Nani Comments On Devineni Umma,perni Nani,ycp Jagan Mohan Reddy Telugu Political Breaking -Jagan Cabinet Ministers Comments On TDP And Janasena Party-Jagan Silent In Ycp Issue Kodali Nani Devineni Umma Perni Mohan Reddy

ఆ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వాయిస్ వినిపించిన జగన్ బయట మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు.ఏ విషయంలోనూ బహిరంగంగా జగన్ స్పందించడంలేదు.జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత బహిరంగ సభలో మాత్రమే మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని చెబుతున్నారే తప్ప మరలా ఎక్కడా తన స్పందనను తెలియజేసేందుకు ఇష్టపడడం లేదు.ఇక జిల్లా పర్యటనల్లో కూడా జగన్ అప్పుడప్పుడు మాత్రమే వెళ్తున్నారు.

జగన్ ఈ విధంగా రాజకీయం చేస్తుంటే ఆయన కేబినెట్లోని మంత్రులు మాత్రం ఇష్టానుసారంగా మీడియా ముందు మాట్లాడుతూ జగన్ క్రెడిట్ ను దెబ్బతీస్తున్నట్టుగా కనిపిస్తోంది.ప్రస్తుతం జనసేన, టీడీపీలు వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నాయి.వారికి కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ మంత్రులు కొడాలి, నాని పేర్ని నాని తదితరులు ముందుకు దూకుతున్నారు.గతంలో వైసీపీ తరఫున ఎవరి మీదైనా ఎదురుదాడి చేయాలంటే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముందు వరుసలో ఉండే వారు.

అసెంబ్లీలో కానీ బయటగాని ఆయన దూకుడు జగన్ కు ఇబ్బందికరంగా మారేది.దీంతో ఆయనను జగన్ సైలెంట్ అవ్వాల్సిందిగా కోరారు.ప్రస్తుతం కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి నాని మాటల తూటాలతో ప్రతిపక్షాల మీద విరుచుకుపడుతున్నారు.

బహిరంగంగా మంత్రులు చేస్తున్నవ్యాఖ్యలు వైసీపీకి తలనొప్పులు తీసుకొస్తున్నారు.ఇదే అదనుగా టిడీపి కూడా సదరు మంత్రులు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తోంది.

తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బియ్యం విషయంలో కామెంట్స్ చేయడంతో కొడాలి నాని తనదైన శైలిలో రెచ్చిపోయారు.మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు గానీ ప్రత్యర్థులపై ఎటువంటి విమర్శలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అది తిరిగి తిరిగి జగన్ మెడకే చుట్టుకుంటుంది.

దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా జగన్ పైనే పడుతుంది.కాబట్టి వారిని కంట్రోల్ చేయాల్సిన పూర్తి బాధ్యత జగన్ కి ఉంది.

అలా కాదు చూసి చూడనట్టు వదిలేస్తాను అనుకుంటే ఆ తరువాత సమాధానం చెప్పుకోవాల్సింది జగన్ మాత్రమే.కొడాలి నాని వల్లభనేని వంశీ నోటి నుంచి వస్తున్న వ్యాఖ్యలు ముందు ముందు వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తాయి అనడంలో సందేహం లేదు.ఈ వ్యాఖ్యలు తమకు అనుకూలంగా మార్చుకుని టిడిపి మరింతగా రెచ్చిపోయే ప్రమాదం ఉంది.కాబట్టి వీరందరినీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత జగన్ మీదే ఉంది.