వైసీపీ – టీడీపీ మంత్రుల మిలాఖ‌త్ పాలిటిక్స్‌కు జ‌గ‌న్ బ్రేక్‌…!  

jagan break to TDP-YSRCP politics,erranna naidu,dharmna prasad rao,TDP,ysrcp,ap politics,latest news,political news,jagan,ap cm jagan,telugu stop,political talk - Telugu Ap Cm Jagan, Ap Politics, Dharmna Prasad Rao, Erranna Naidu, Jagan, Latest News, Political News, Political Talk, Tdp, Telugu Stop

శ్రీకాకుళం జిల్లా రాజ‌కీయాల్లో ఎప్ప‌టి నుంచో ఓ టాక్ ఉంది. కింజార‌పు, ధ‌ర్మాన కుటుంబాలు రెండు వేర్వేరు పార్టీల్లో ఉన్నా వారి మ‌ధ్య తెర‌వెన‌క ఒప్పందాలు ఉంటాయంటారు.

TeluguStop.com - Jagan Break To Tdp Ysrcp Politics

వీరిది కొప్పుల వెల‌మ సామాజిక వ‌ర్గం.రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచినా.

ఏ పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్నా ఈ రెండు కుటుంబాల‌కు చెందిన నేత‌లు మాత్రం ఎన్నిక‌ల్లో గెలిచేలా వీరు ఒప్పందాలు చేసుకుంటార‌న్న‌ది సిక్కోలు టాక్‌.ఉదాహ‌ర‌ణ‌కు 1999లో రాష్ట్రంలో టీడీపీ గెలిస్తే న‌ర‌స‌న్న‌పేట‌లో మాత్రం కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు గెలిచారు.ఇందుకు ఎర్ర‌న్నాయుడు స‌హ‌కారం ఉందంటారు.

TeluguStop.com - వైసీపీ – టీడీపీ మంత్రుల మిలాఖ‌త్ పాలిటిక్స్‌కు జ‌గ‌న్ బ్రేక్‌…-General-Telugu-Telugu Tollywood Photo Image

2004లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భంజ‌నం వీస్తే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నుంచి ఎంపీగా ఎర్ర‌న్నాయుడు, అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా గెలిచారు.గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ సునామీలో టెక్కలిలో అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా, శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహ‌న్ నాయుడు గెలిచారు.ఇందుకు ఈ రెండు కుటుంబాలు త‌మ కుటుంబాలే పెత్త‌నం చేయాల‌ని.

త‌మ వెల‌మే అధికారంలో ఉండాల‌ని ఒప్పందాలు చేసుకోవ‌డ‌మే అట‌.అలాంటి రెండు కుటుంబాల తెర వెన‌క ఒప్పందాల‌కు జ‌గ‌న్ మార్క్ చెక్ ప‌డింద‌ని తెలుస్తోంది.జ‌గ‌న్ తెలివిగా ధ‌ర్మాన సోద‌రుల్లో కృష్ణ‌దాస్‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు.ఓ వైపు అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా ఉన్నారు.

అటు రామ్మోహ‌న్ నాయుడు లోక్‌స‌భ‌లో వైసీపీని ఇరుకు పెడుతున్నారు.ఎర్ర‌న్న కుటుంబంతో తెర వెన‌క ఒప్పందాలు చేసుకుంటోన్న ధ‌ర్మాన‌ను ప‌క్క‌న పెట్టిన జ‌గ‌న్ కృష్ణ‌దాస్‌ను ప్రోత్స‌హిస్తుండ‌డంతో పాటు అచ్చెన్న‌తో పాటు ఎర్ర‌న్న కుటుంబంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేయిస్తున్నార‌ట‌.ఇప్పుడు కృష్ణ‌దాస్ అచ్చెన్న‌పై ఒంటికాలితో లేస్తున్నారు.ఏ చిన్న ఛాన్స్ వ‌చ్చినా అచ్చెన్న‌, కృష్ణ‌దాస్ను ఓ ఆటాడుకుంటున్నారు.

అలాగే జిల్లాలో కాళింగ సామాజిక వ‌ర్గానికి ప్ర‌యార్టీ ఇవ్వ‌డం ద్వారా అటు దువ్వాడ శ్రీనివాస్‌, కిల్లి కృపారాణి, స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం, పేరాడ తిల‌క్‌ల‌తో కూడా ఎర్ర‌న్న కుటుంబంపై ఎటాక్ చేయించ‌డంతో పాటు మ‌త్స్య‌కార వ‌ర్గానికి చెందిన మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుతో కూడా ఎదురు దాడి చేయిస్తున్నారు.దీంతో ధ‌ర్మాన సోద‌రులు కూడా స్వ‌రం పెంచి కులాలు, బంధుత్వాలు ప‌క్క‌న పెట్టి అచ్చెన్న‌, రాముపై దాడి చేస్తున్నారు.

#AP Politics #Jagan #Political Talk #Erranna Naidu #AP CM Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jagan Break To Tdp Ysrcp Politics Related Telugu News,Photos/Pics,Images..