జనాలు నచ్చేలా.. మెచ్చేలా ! జగన్ లాజిక్ అదే ?

ప్రతిపక్షాలు ఎంతగా విమర్శలు చేస్తున్న, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నా, ఏపీ సీఎంగా ఉన్న జగన్ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు.ఏదో రకంగా అన్ని విషయాల్లోనూ పైచేయి సాధించాలని ప్రయత్నిస్తూనే సక్సెస్ అవుతూ వస్తున్నారు.

 Jagan Believes That Welfare Schemes Will Bring Back To Power, Jagan, Ap Cm, Tdp,-TeluguStop.com

ముఖ్యంగా పార్టీలో ఎమ్మెల్యేలు, మంత్రులు కీలకమైన నాయకులు ఎంతమంది ఉన్నా, వారు ఎవరూ ఏ విషయాలపైన  స్పందించకపోయినా, జగన్ సైతం మౌనంగానే ఉంటున్నా,  చేయాల్సిన పని మాత్రం చాపకింద నీరులా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.జనాల్లో ఎక్కడ వైసిపికి ఆదరణ తగ్గకుండా చూసుకుంటూ వస్తున్నారు.

గతంతో పోలిస్తే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కాస్త  పుంజుకున్నట్టు గానే కనిపిస్తోంది .అయినా ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టిడిపికి గతం కంటే బ్యాంకు బాగా తగ్గింది.సార్వత్రిక ఎన్నికల్లో 38 శాతం ఓటింగ్ రాగా,  ఇటీవల జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో అధికాస్తా 32 శాతానికి తగ్గిపోయింది.దీంతో టిడిపి గ్రాఫ్ పెరిగినట్లు కనిపించినా, ఓటింగ్ శాతం దగ్గడం ఆ పార్టీ నేతలకు రుచించడం లేదు.

వైసీపీ ప్రభుత్వంలో సర్వం జగన్ అన్నట్లుగానే ఉంది.
  మంత్రులలో చాలామంది కొత్తవారు కావడం,  ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో పెద్దగా ప్రభావం చూపించకపోయినా, జగన్ ఒక్కడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కార్యకలాపాలు జరిగిపోతున్నాయి.

ఈ వ్యవహారాలన్నీ టీడీపీకి మరింత ఆందోళన కలిగిస్తున్నాయి  అయితే తమ గ్రాఫ్ పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా, ఓట్లు మాత్రం రాలకపోవడం ఆలోచనలో పడేస్తోంది.బిజెపి, జనసేన, టిడిపి లు ఎన్ని రకాలుగా విమర్శలు చేస్తున్న, జనాలు మాత్రం అవి ఏవి పట్టించుకోనట్టు గా కనిపిస్తున్నారు.

దీనికి కారణం జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కారణంగా కనిపిస్తోంది.
 జగన్ సైతం ఈ పథకాలనే బాగా నమ్ముకున్నారు.

Telugu Ap Cm, Ap, Chandrababu, Jagan, Janasena, Ministers, Mlas, Welfare Schemes

వివిధ పథకాల పేరుతో నేరుగా జనాల ఖాతాల్లోకి సొమ్ము వెళితే వారిని అందుకున్న వాళ్లల్లో తప్పనిసరిగా కృతజ్ఞత ఉంటుందని గతంలో ఈ విధంగా నేరుగా బ్యాంకు ఖాతాలకు సొమ్ములు వేసే విధానం లేకపోవడం , ఏదైనా ఒక పని చేయించుకోవాలి అంటే ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు ఎదుర్కొనే వారమని, కానీ జగన్ పరిపాలన లో తమ ఇంటికి వస్తున్నాయని జనాల్లో సంతృప్తి కలగడం , వాలంటీర్ వ్యవస్థ కూడా జగన్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న విధానం, ఇవన్నీ జనాల్లో జగన్ ప్రభుత్వం పై క్రేజ్ ను పెంచుతున్నాయి.ఈ నమ్మకంతోనే జగన్ ఎవరినీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నట్టు గా కనిపిస్తున్నారు.ఇవే మళ్లీ తమను అధికారంలో కూర్చోబెడతాయి అని జగన్ నమ్ముతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube