జగన్ బాబు ఇద్దరూ ఇద్దరే ! కేసిఆరే నయం ?

టీడీపీ అధినేత చంద్రబాబు,  ఏపీ సీఎం జగన్ ఇద్దరూ ఇద్దరే ఏ విషయంలోనూ రాజీ పడరు.  అన్ని విషయాలలోనూ తనదే పై చేయిగా ఉండాలనుకునే మనస్తత్వం.

 Jagan Babu Is Both  Cure Casey Jagan, Ysrcp, Ap, Tdp, Chandrababu, Ap Cm Jagan,-TeluguStop.com

టీడీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీని ఇరుకున పెట్టే విధంగా జగన్ వ్యవహరించేవారు.ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రజా సమస్యలను హైలెట్ చేసుకుంటూ జగన్ జనాల్లో తిరుగుతూ బలం పెంచుకుంటూ వచ్చారు.

జగన్ నిర్ణయాలతో టీడీపీ పై జనాల్లో క్రమక్రమంగా వ్యతిరేకత పెరిగి వైసీపీ భారీ మెజారిటీతో ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు సాధ్యమయ్యింది.ఇక వైసీపీ ఏపీలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు సైతం ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు.

  జగన్ ముఖ్యమంత్రిగా విఫలమయ్యారని,  ఆయన క్షణం కూడా ముఖ్యమంత్రి గా ఉండేందుకు అర్హుడు కాదని పదే పదే చెబుతూ వైసీపీ ప్రభుత్వం లోని లోపాలను ఎత్తిచూపుతూ బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే ఈ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు,  ప్రతి విమర్శలు చేసుకునేందుకే సమయం కేటాయిస్తున్నారు తప్ప , రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఈ ఇద్దరు నేతలు చిత్తశుద్ధిగా వ్యవహరించ లేకపోవడం తో ఏపీ ప్రయోజనాల విషయంలో కేంద్రం చిన్న చూపు చూడడానికి కారణమవుతోంది.

ఏపీకి ప్రత్యేక హోదా , విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ,  విభజన హామీల అమలు ఇలా చాలా విషయాల్లో కేంద్రాన్ని నిలదీసేందుకు అవకాశం ఉన్నా, అధికార పార్టీ కానీ,  ప్రధాన ప్రతిపక్షం కానీ ఈ విషయంలో చిత్తశుద్ధి చూపించడం లేదు.టీడీపీ పై వైసీపీ.

వైసీపీపై టీడీపీ అన్నట్లుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప , కేంద్రాన్ని గట్టిగా నిలదీసి రాష్ట్ర ప్రయోజనాలు సాధించే విషయంలో ఏమాత్రం చొరవ చూపించడం లేదు.ఈ రెండు పార్టీల వైఖరి కారణంగా ఏపీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

అయినా అవేవీ తమకు పట్టనట్లు గానే ఈ రెండు పార్టీల నేతలు వ్యవహరిస్తున్నారు.

Telugu Ap Cm Jagan, Central, Chandrababu, Jagan, Ysrcp-Telugu Political News

2024 ఎన్నికల్లో ఏ విధంగా ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలనే కోణంలో చంద్రబాబు అడుగులు వేస్తుండగా మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండేలా జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు .కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలు పక్కనపెట్టి బీజేపీని ధైర్యంగా రాష్ట్ర సమస్యల గురించి నిలదీసే ప్రయత్నం చేయడం లేదు .కనీసం పార్లమెంట్ లోనూ ఈ విషయంపై గట్టిగా నిలదీసి సభను స్తంభింపజేసే ఆలోచన సైతం చేయలేకపోతున్నారు.  ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను మెచ్చుకోవాల్సిందే.మిగతా విషయాల్లో ఎలా ఉన్నా,  తెలంగాణ ప్రయోజనాల విషయంలో కేసీఆర్ కేంద్రంతో గట్టిగానే తలపడుతున్నారు .ముఖ్యంగా ధాన్యం  కొనుగోలు విషయంలో గత ఐదు రోజులుగా ఉభయసభల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన, నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ,  సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.కానీ ఈ విషయంలో ఏపీలో అధికార పార్టీ,  ప్రతిపక్ష పార్టీ రెండు విఫలం అయినట్టు గానే కనిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube