కోడి కత్తి కేసు : బెయిల్ కోసం నిందితుడి ప్రయత్నాలు  

  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో కోడి కత్తి తో హత్యాయత్నం చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్నాడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీనివాసరావు. అయితే తాజాగా అతడు తన తరపున కేసు వాదిస్తున్న న్యాయవాది సలీం తో రాజమండ్రి సుబ జైలు నుంచి ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తనకు బెయిల్ కు కావాల్సిన ప్రొసీజర్ సిద్ధం చేయాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది.

  • Jagan Attack Case Accused Srinivasarao Wanted To Bail-

    Jagan Attack Case Accused Srinivasarao Wanted To Bail

  • అయితే …. బయటకు వస్తే ప్రాణహాని ఉంటుందని న్యాయవాది సలీం తెలపగా అయినప్పటికి బెయిల్ పై బయటకు వస్తానని, బెయిల్ సిద్ధం చేయాలని శ్రీనివాస్ కోరాడు. ఈ నేపథ్యంలో రేపు రాజమండ్రి సబ్ జైలులో నిందితుడి శ్రీనివాస్ ను, తరువాత లంకా గ్రామంలో శ్రీనివాస్ కుటుంభ సభ్యులను న్యాయవాదులు సలీం, మట్టా జయకర్ కలిసి మాట్లాడబోతున్నట్టు తెలుస్తోంది.