పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు : ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు శుభవార్త అందించింది.రాష్ట్రంలో కొత్తగా ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చింది.

 Ap Government, Cm, Special Concessions-TeluguStop.com

ఈ పాలసీని 2020-23 వరకు అమలు చేయనుంది.దీనికి సంబంధించిన విధానాలను మంత్రి గౌతమ్ రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ రోజా అధికారికంగా ప్రకటించారు.

ఈ పాలసీలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక రాయితీలు అందించింది.మెగా ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడి ప్రతిపాదనలకు అనుగుణంగా రాయితీని అందించనుంది.

ఇప్పటికే వైఎస్సార్ ఏపీ వన్ పేరుతో మల్టీ బిజినెస్ సెంటర్, పెట్రో కెమికల్స్ తదితర రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇచ్చింది.

పారిశ్రామిక శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.

‘‘ పారిశ్రామిక వేత్తలకు సులువైన నిబంధనలతో వైఎస్సార్ వన్ పేరిట కొత్త విధానాన్ని తీసుకొచ్చాం.రాష్ట్రంలో నూతన పరిశ్రమల అభివృద్ధికి, నైపుణ్యం ఉన్న యువకులకు పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడిగా ఈ స్కీం వర్తిస్తుంది.

ప్రస్తుతం అమలు అవుతున్న పారిశ్రామిక విధానం మార్చి నెలలో గడువు ముగుస్తోంది.గత ప్రభుత్వం అమలుకు సాధ్యం కానీ అంశాలను అందులో చేర్చింది.

ఆ హామీల అమలు చేయాలంటే కేంద్రానికి కూడా సాధ్యం కాదు.అందుకే సరళ పద్ధతిలో కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తున్నాం’’ అంటూ మంత్రి పేర్కొన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube