ఇంత అల్లరి జరుగుతున్నా జగన్ నోరు విప్పరేమి ?

కొంతమంది చేసేది తక్కువ అయినా దానిని గొప్పగా చెప్పుకుంటూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.మరికొంతమంది మాత్రం ఎంత చేసినా దానిని సరైన విధంగా ప్రచారం చేసుకోలేక తిరిగి విమర్శలు పాలవుతుంటారు.

 Ap Cm Jagan Silent In Corona Issue In Andhrapradesh, Jagan, Ap, Corona Virus, Yc-TeluguStop.com

ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ ఆ విధంగానే విమర్శలు పాలు అవుతున్నట్లు కనిపిస్తోంది.దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తీవ్రస్థాయిలో ఉంది.

అయితే ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు కారణంగా ఏపీలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరిగింది.ప్రజలకు సూచనలు చేసే విషయంలోనూ, ఈ వైరస్ వ్యాప్తిని మరింత తీవ్రతరం అవుతున్నా, జాగ్రత్తలు చెప్పే విషయం లోనూ, ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకున్న నివారణ చర్యలు పైన జగన్ నోరు విప్పలేదు.

దీంతో ఆయన రాజకీయ ప్రత్యర్థులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.అయినా సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో అధికార పార్టీ ఉంది.

Telugu Corona Ap, Corona, Jagan, Jagan Corona, Ycp-Political

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో ఏపీ ప్రభుత్వం సరైన విధంగా స్పందించడం లేదని, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ కరోనా నివారణలో వెనకబడి పోయిందని, జగన్ చేతగాని సీఎం అని ఇలా రకరకాల విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నా, జగన్ నోరు మెదపడం లేదు.ఇక సోషల్ మీడియాలోనూ జగన్ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో విమర్శలు రేగుతున్నాయి.పార్టీ తరఫున అధికారికంగా ఎవరు స్పందించక పోవడంతో పార్టీ కార్యకర్తలు ఇష్టానుసారంగా జగన్ తరఫున స్పందిస్తూ మరింతగా ప్రభుత్వ పరువు మంట కలుపుతున్నారు.అసలు కరోనా కట్టడి చర్యలపై ఈ స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నా, జగన్ మీడియా సమావేశాలు నిర్వహించడం లేదు.

ప్రజలను ఉద్దేశించి ఎందుకు మాట్లాడడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి.అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే జగన్ కరోనా విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

అయినా ఆయనపై విమర్శలు మాత్రం తప్పడం లేదు.ఈ వైఖరి కారణంగానే అటు ప్రజల్లోనూ అబాసుపాలు అవడమే కాకుండా, రాజకీయ ప్రత్యర్థులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నా సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఏపీ అధికార పార్టీ ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube