జ‌గ‌న‌న్న ఇళ్లు అంత చీఫా... జ‌రిగే ప‌నేనా...!

ఏపీలో ఇళ్లు లేని వారు ఉండ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ఏకంగా 30 ల‌క్ష‌ల ఇళ్ల‌ను నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.క్రిస్మ‌స్ కానుక‌గా ల‌బ్ధిదారుల‌కు ఇప్ప‌టికే ఇళ్ల ప‌ట్టాలు మంజూరు చేసే ప్ర‌క్రియ కూడా ప్రారంభించింది.

 Jagan Anna Houses Are So Cheap ... Will It Work Out ...!, Ap Cm, Jagan, Houses,-TeluguStop.com

ఇళ్ల నిర్మాణం కూడా కొన్ని చోట్ల ప్రారంభించేశారు.మ‌హా అయితే మ‌రో నాలుగైదు నెల‌ల్లో రాష్ట్రంలో ఈ 30 ల‌క్ష‌ల ఇళ్ల‌ను పూర్తి చేసి ల‌బ్ధిదారుల చేత గృహ‌ప్ర‌వేశం కూడా చేయించాల‌న్న ల‌క్ష్యంతోనే స‌ర్కారు ఉంది.

ఈ ఇళ్ల నిర్మాణంలో ప్ర‌భుత్వ‌మే ల‌బ్ధిదారుల‌కు మూడు ఆప్ష‌న్లు ఇచ్చింది.అందులో ఏదో ఒక‌టి ఎంచుకోమ‌ని కూడా చెప్పింది.ఈ మూడు ఆప్ష‌న్ల‌లో మెద‌టి రెండు ఆప్ష‌న్ల‌లో ల‌బ్ధిదారుల‌కు డ‌బ్బులు ఇస్తే వారే ఇళ్లు క‌ట్టుకోవాల్సి ఉంటుంది.ఇక మూడో ఆప్ష‌న్ ప్ర‌భుత్వ‌మే ఇళ్లు క‌ట్టి ఇస్తుంది.అయితే తొలి రెండు ఆప్ష‌న్ల‌లో ల‌బ్ధిదారుల‌కు ప్ర‌భుత్వ ఇచ్చే డ‌బ్బు కేవ‌లం రు 1.80 ల‌క్ష‌లు మాత్ర‌మే.అయితే ప్ర‌భుత్వం ఇచ్చే రు 1.80 ల‌క్షల‌కు బెడ్ రూం, కిచెన్‌, హాల్‌, వ‌రంగా వ‌స్తుందా ? అన్న‌ది డౌటే.

పైగా ప్ర‌భుత్వ ప్ర‌మాణాల ప్ర‌కారం క‌ట్టాలంటే ఏకంగా రు. 7-8 ల‌క్ష‌ల వ‌ర‌కు అవుతుంద‌ని నిపుణులే చెపుతున్నారు. 340 చ‌ద‌ర‌పు అడుగుల్లో ఇళ్లు క‌ట్టేందుకు ఎంత‌లేద‌న్నా తాపీ వారే రు. 70 వేల‌కు పైగా ఖ‌ర్చ‌వుతుంద‌ని అంటున్నారు.ఇక లాక్‌డౌన్ త‌ర్వాత సిమెంట్‌, ఐరెన్‌తో పాటు అన్ని వ‌స్తువ‌ల రేట్లు పెరిగాయి.ఈ లెక్క‌న చూస్తే రు. 1.80 ల‌క్ష‌ల‌కు ల‌బ్ధిదారుల‌కు ఏ మాత్రం ఇళ్లు పూర్త‌వ్వ‌ద‌ని తేలిపోతోంది.అయితే ఈ మొత్తంతోనే ఇళ్లు క‌ట్టేయ‌వ‌చ్చ‌ని ప్ర‌భుత్వం ఓ మోడ‌ల్ హౌస్ కూడా నిర్మించి ఫొటో రిలీజ్ చేసింది.

వాస్త‌వంగా ఆ రేటుకు ఇంటి నిర్మాణంలో 50 శాతం కూడా పూర్త‌య్యే ప‌రిస్థితి లేదు.

మ‌రి ఈ లెక్క‌న చూస్తే ల‌బ్ధిదారుల‌కు ఆప్ష‌న్ ఇవ్వ‌డం కంటే ప్ర‌భుత్వ‌మే ఇళ్లు నిర్మించి ఇవ్వ‌డ‌మే బెట‌ర్‌గా ఉంది.?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube