ఆ మంత్రిగారి అలకకు కారణం ఏంటి ?  

Jagan Angry On Botsa Satya Narayana-and Mla\\'s,andhra Pradesh,jagan,ministers

పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలుకూడా కాలేదు అప్పుడు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలయినట్టు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జగన్ అనుసరిస్తున్న ధోరణి సీనియర్ నేతలకు మింగుడుపడడంలేదట. గత ప్రభుత్వంలో మంత్రిగా చేసి సీనియర్ పొలిటిషన్ గా ఉన్న ఓ ఉత్తరాంధ్ర మంత్రి జగన్ తీరుపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది..

ఆ మంత్రిగారి అలకకు కారణం ఏంటి ? -Jagan Angry On Botsa Satya Narayana

తాజాగా సీఆర్డీఏ పై ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన కీలక సమావేశానికి పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ హాజరు కాకపోవడం చర్చనీయాంశం అయ్యింది. ఈ సమావేశానికి సీఆర్డీఏ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జగన్ అధికారులను ఆరా తీశారు.

గత సమీక్షలో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. అయితే ఇప్పుడు పాల్గొనకపోవడమే చర్చనీయాంశంగా మారింది.

ముఖ్యంగా రాజధాని అమరావతికి సంబంధించి మంత్రి బొత్స చేస్తున్న ప్రకటనలు జగన్ కు అస్సలు నచ్చడంలేదట.ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బొత్స అమరావతి ఆగదని, నిర్మాణాలు కొనసాగుతాయని పదే పదే చెబుతూ ఉండడం ఒక కారణమట.

ఇదే విషయమై జగన్ ఓ సారి బొత్సను పిలిపించి క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం అధికారికంగా తీసుకున్న నిర్ణయాలను మాత్రమే మీడియా ముందు ప్రకటించాలని, ప్రభుత్వంలో ఎటువంటి చర్చ జరగకుండా అమరావతి నిర్మాణం కొనసాగుతుందని ఎలా ప్రకటనలు చేస్తున్నారంటూ గట్టిగ క్లాస్ పీకారట. అయితే ఈ పరిణామం ఊహించని బొత్స తీవ్ర అసహనానికి గురయ్యారట..

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశానని, రాజశేఖర రెడ్డి హయాంలో కూడా తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇలా ఆంకాశాలు పెట్టి నన్ను అవమానిస్తున్నారంటూ తన సన్నహితుల వద్ద బొత్స ఆవేదన వ్యక్తం చేశారట. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వం చాలా క్లారిటీ తో ముందుకు వెళ్తున్నట్టు అర్ధం అవుతోంది.రాజధాని విషయంలో ఇంకా వేచి చూసే ధోరణిలో ఉండాలన్నదే వైసీపీ ప్రభుత్వ విధానంగా కనబడుతోంది. అయితే.

దీన్ని అర్థం చేసుకోకుండా బొత్స ప్రకటనలు చేయడంతో జగన్ ఆగ్రహానికి గురయినట్టు తెలుస్తోంది. అయితే ఇంకా కొంతమంది మంత్రుల విషయంలోనూ జగన్ క్లాస్ పీకుతుండడంతో వారు లోలోపల అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం కూడా ఈ మధ్య ఎక్కువయ్యింది.