వైసీపీ లో లీకు వీరులు ? జగన్ చేతికి ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ?

పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించి ఏపీ సీఎం జగన్ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.పార్టీ ప్రభుత్వం రెండు కళ్ళు అంటూ జగన్ పని చేసుకుంటూ వెళుతున్నారు.

 Jagan Angry Over Leak Of Key Contents, Ys Jagan, Ycp, Narendra Modi, Jagan Met M-TeluguStop.com

అయితే జగన్ తాపత్రయాన్ని అర్థం చేసుకుని కొంత మంది పార్టీ నేతలు సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచే విధంగా తయారవ్వడం, దీని కారణంగా ప్రభుత్వం అభాసుపాలు అవ్వడం వంటి వ్యవహారాలు కొంతకాలంగా వైసీపీలో చోటుచేసుకుంటున్నాయి.కొంతమంది పార్టీలోని కీలకమైన నేతలు అత్యంత రహస్యమైన విషయాలను సైతం మీడియాకు , టీడీపీ అనుకూల వ్యక్తులకు లీక్ చేస్తూ, పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తయారవ్వడంపై జగన్ సీరియస్ గానే దృష్టి సారించారు.

ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ తో జగన్ భేటీ అయిన సమావేశంలో చర్చించిన అంశాలు సైతం  క్షణాల్లో మీడియాకు చేరిపోవడం, దానికి సంబంధించి టీడీపీ అనుకూల మీడియాలో ప్రత్యేక కథనాలు వెలువడడం, ఎన్నో వ్యవహారాలు చోటుచేసుకున్నాయి.ఇవే కాకుండా జగన్ తీసుకుంటున్న కీలక నిర్ణయాలకు సంబంధించిన విషయాలు అందరికంటే ముందుగానే టీడీపీ అనుకూల మీడియాకు చేరిపోతుండడంపై జగన్ కొంతకాలంగా గుర్రుగా ఉన్నారు.

ఈ విషయాన్ని తేలిగ్గా వదిలిపెడితే లాభంలేదనే ఆలోచనతో లీకు వీరుల సంగతి తేల్చాల్సిందిగా ఇంటిలిజెన్స్ విభాగానికి జగన్ బాధ్యతలు అప్పగించడంతో, వారు రంగంలోకి దిగి మొత్తం లీక్ వీరులు ఎవరో తేల్చేశారు.

Telugu Jaganangry, Jagan Met Modi, Leaks, Narendra Modi, Ycp, Ys Jagan-Telugu Po

వైసీపీలో సుమారు పదిమంది వరకు ఇటువంటి నాయకులు ఉన్నారని, వారు పార్టీపై అసంతృప్తితో ఈ విధంగా మీడియాకు లీక్ చేస్తున్నారని, జగన్ కు రిపోర్ట్ అందించరట.ఈ లిస్టులో నెల్లూరు, సీమ జిల్లాలకు చెందిన కొంతమంది కీలక నాయకులు, ఓ మంత్రి  ఉన్నట్లుగా తెలుస్తోంది.వారి జగన్ తీరుతో అసంతృప్తితో ఈ విధంగా మీడియాకు లీకులు ఇస్తున్నారట.

వారి లిస్ట్ పూర్తిగా జగన్ చేతికి రావడంతో, వారిపై చర్యలు తీసుకునేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ వ్యవహారం వైసీపీ లో హాట్ టాపిక్ గా మారింది.

కొంతమంది మంత్రి పదవులు రానివారు, జగన్ తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అభిప్రాయపడుతున్న వారు, ఇలా చాలామంది ఉండడంతో, ఇప్పుడు వారిపై జగన్ ఏ చర్య తీసుకుంటారనేది పార్టీలో చర్చనీయాంశమవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube