చిక్కుల్లో ఏపీ ప్రభుత్వం ? మంత్రులపై జగన్ ఆగ్రహం ?

గత కొద్దిరోజులుగా ఏపీ ప్రభుత్వం అనేక అనేక విమర్శలు ఎదుర్కొంటోంది.సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఎంత మేలు కలిగేలా చేస్తున్నా, పూర్తి స్థాయిలో అవి ప్రజల్లోకి వెళ్లడం లేదని, పైగా అన్నిని విషయాల్లోనూ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలే బాగా హైలెట్ అవుతూ,  ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి అనే విషయాన్ని జగన్ గ్రహించారు.

 Ap Cm Jagan, Ysrcp, Ap Tdp, Chandrababu, Jagan Warning On On Ministers, Pulichin-TeluguStop.com

కొన్ని కొన్ని విషయాల్లో ప్రభుత్వం తప్పిదం ఏమీ లేకపోయినా,  ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉండటం వాటిని సరైన రీతిలో పార్టీ నాయకులు,  మంత్రులు,  ఎమ్మెల్యేలు లేకపోవడం ఈ వ్యవహారాలతో ప్రతిపక్షాలు సాధిస్తుండడం ఇవన్నీ గత కొంతకాలంగా జగన్ కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తూనే వస్తున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున నామినేటెడ్ పదవులను కట్టబెట్టిన జగన్ వారందరూ వైసీపీ ప్రభుత్వం పై వచ్చే విమర్శలను తిప్పి కొడతామని ఆశాభావంతో ఉన్నారు కొత్తగా పదవులు తీసుకుని నాయకులతోపాటు వైసిపి సీనియర్లు మంత్రులు అంత మౌనంగా వెళ్ళి పోవడం కేవలం ఒకరిద్దరు మాత్రమే ఆ విమర్శలకు కౌంటర్ ఇస్తూ ఉండడం జగన్ తాజాగా సీరియస్ అయ్యారు జరిగిన కేబినెట్ మీటింగ్లు మంత్రుల వ్యవహారశైలిపై జగన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది ప్రస్తుతం బిజెపి పెద్ద ఎత్తున ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నా, ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా కొంతమంది బిజెపి నాయకుల పేర్లను జగన్ రాష్ట్రాల నుంచి వారి విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వాల్సిందిగా మంత్రులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

Telugu Ap Cm, Ap, Ap Ministers, Chandrababu, Jagan, Ysrcp-Telugu Political News

ముఖ్యంగా పులిచింతల ప్రాజెక్టు గేట్ విరిగిపోవడం పై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, బిజెపి విమర్శలు చేస్తున్న మంత్రులు మౌనంగా ఉన్నారని, ఇవన్నీ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకు వెళ్తాయని, మంత్రులంతా అలర్ట్ గా ఉంటూ ప్రతిపక్షాలు చేసే విమర్శలకు గట్టి సమాధానం ఇవ్వాలని కాస్త ఘాటుగానే క్లాస్ పీకినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube