ఆ విషయంలో జగన్ బాబు ఇద్దరూ వెనకడుగు వేస్తున్నారే ?

ఎన్నికల సమయంలో ప్రతి విషయంలోనూ ప్రత్యర్థులకంటే తానే ముందుండాలని రాజకీయ పార్టీలు పోటీ పడుతూ ముందుకెళ్తుంటాయి.కానీ ఇప్పుడు విచిత్రంగా ఏపీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీకంటే వెనుక ఉండాలని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.

 Jagan And Chandrababu Are Stepping Back In One Particular Thing-TeluguStop.com

ప్రస్తుతం ఈ ఎన్నికలల్లో గెలవడం అన్ని రాజకీయ పార్టీలకు అత్యవసరం.అధికారంలో ఉన్న టీడీపీ మరోసారి అధికారం దక్కించుకోవాలని చూస్తుండగా, చాలా కాలంగా అధికారం దక్కించుకోవాలని తహతహలాడుతున్న వైసీపీ కి ఈ ఎన్నికల్లో గెలవడం అనేది చాలా కీలకం.

ఇప్పుడు కనుక అధికారంలోకి రాకపోతే ముందు ముందు చాలా కస్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది.ఇక కొత్తగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన కు కూడా గెలుపు అవసరమే.

ఎన్నికల్లో గెలుపు కోసం ఆరాటపడుతున్న రాజకీయ పార్టీలు ఒక విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నాయి.ముందు ఒక పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తే అందులోని వాగ్ధానాలను మించి ఉండేలా తమ మేనిఫెస్టో ఉండేలా రెండు ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి.

అందుకే నువ్వు ముందంటే నువ్వు ముందు అంటూ తమ మేనిఫెస్టోల విడుదలను వాయిదా వేస్తున్నాయి.

ఎన్నికల సంఘం కొత్త నిబంధనల ప్రకారం ఎన్నికలకు 48 గంటల ముందు మేనిఫెస్టోలు విడుదల చెయ్యడం కుదరదు.48 గంటల ముందు అంటే ఏప్రిల్ 9వ తారీఖు.చివరి నిముషం వరకూ చూస్తారా అనేది చూడాలి.9వ తారీఖుతోనే ప్రచారం కూడా పూర్తి అవుతుంది.చివరి నిముషం వరకూ ఆగితే మేనిఫెస్టోను ప్రజలలోకి తీసుకుని వెళ్లడం చాలా కష్టం.

ఈ విషయంలో పార్టీ అధినాయకులు ఏం చేస్తారో అన్నదే తేలాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube