ఎలక్షన్ తర్వాత కూడా భయం నీడలో బాబు, జగన్! కారణం ఇదేనా  

ఎన్నికల తర్వాత కూడా రిజల్ట్ గురించి భయపడుతున్న జగన్, చంద్రబాబు. .

Jagan And Babu Fear About Election Result-

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిపోయాయి.ఇక ఎన్నికలు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మరో నెల రోజులలో క్లారిటీ వచ్చేస్తుంది.అయితే ఎన్నికల తర్వాత కూడా ప్రజల తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఏపీలో రాజకీయ వేది తగ్గలేదనే చెప్పాలి.

Jagan And Babu Fear About Election Result--Jagan And Babu Fear About Election Result-

ముఖ్యంగా అధికార పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వేదికగా రాజకీయాలు చేస్తూ, ఎన్నికల సంఘం మీద, అలాగే ప్రధాని మోడీ మీద విమర్శలు చేస్తూ ఎవీఎం మిషన్ లతో పాటు వీవీ ప్యాట్ లని లెక్కించాలని డిమాండ్ చేస్తున్నాడు.ఓ విధంగా చెప్పాలంటే రాబోయే ఫలితాలు గురించి అప్పుడే టెన్షన్ పడుతున్నాడు.మరో వైపు తమదే అధికారం అంటూ కబుర్లు చెబుతున్నారు.ఇక వైసీపీ పార్టీ నేతలు కూడా ఓ వైపు విజయం మీద ధీమా వ్యక్తం చేస్తూనే మరో వైపు ఎన్నికల సంఘంని కలవడం, అలాగే గవర్నర్ ని కలిసి జగన్ శాంతి భద్రతలు క్షీణించాయని ఫిర్యాద్దు చేయడానికి రెడీ కావడం.

ఏపీ పోలీసులపై తమకి నమ్మకం లేదని ఈవీఎంల సెక్యూరిటీకి కేంద్ర బలగాలని దించాలని కోరడం చూస్తుంటే వారు కూడా చంద్రబాబు అధికారం ఉపయోగించుకొని మిషన్ లని మార్చే ప్రయత్నం చేస్తాడా అనే భయం ఓ వైపు, అలాగే ఈ ఎన్నికలలో గెలవకపోతే భవిష్యత్తు ఉండదనే భయం మరో వైపు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటూ రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ సాగుతుంది.అందులో ఎన్నికల తర్వాత కూడా వైసీపీ భయపడుతుంది అంటూ చెబుతున్నారు.