పాలన అదుపు తప్పిందా ? నాయకులు గతి తప్పుతున్నారా ?

అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు గా ముందుకు వెళ్తున్నారు ఏపీ సీఎం జగన్.కేవలం ఐదేళ్ళ రాజకీయానికి తాను పరిమితం కాదని, 30 ఏళ్లపాటు రాజకీయం చేస్తానని, పదేపదే చెబుతూ, పార్టీ నాయకుల్లో ఉత్సాహం తీసుకువచ్చే విధంగా జగన్ ప్రయత్నిస్తున్నారు.

 Jagan Administration Is Not Getting Good Credit  Jagan, Ap, Bjp, Chandrababu, Ml-TeluguStop.com

తన పరిపాలన గురించి ప్రజలంతా చర్చించుకోవాలి అని, ఎవరికీ ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అందరికీ చేరువ అయితే తాను ఆశించిన ఫలితాలు వస్తాయని జగన్ నమ్ముతున్నారు అయితే జగన్ ఆలోచనలను అమలు చేసే విషయంలో అనేక రకాలుగా ఆయనకు ఎదురు దెబ్బలు తగులుతున్నట్టుగా కనిపిస్తున్నాయి.

జగన్ తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు మేలు చేసేవే అయినా, వాటిని అమలు చేసే క్రమంలో ఎన్నో రకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఫలితంగా ప్రభుత్వం అభాసుపాలు కావాల్సి వస్తోంది.ఇప్పటికే అనేక విషయాలకు సంబంధించి కోర్టులు ఎన్నోసార్లు వైసీపీ ప్రభుత్వం ఎదురుదెబ్బలు తింది.ప్రతిపక్షాలు చేసే విమర్శలకు కొన్నిసార్లు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.ఇటువంటి వ్యవహారాల కారణంగా, జగన్ అనుకున్నంత స్థాయిలో క్రెడిట్ సంపాదించలేక పోతున్నారు.

అడుగడుగున కోర్టు అడ్డంకులు ఎన్నో జగన్ కు వస్తున్నాయి.ఇది ఇలా ఉంటే, సొంత పార్టీ నాయకులు సైతం జగన్ ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా ఉండడం, అసమ్మతితో పార్టీకి చేటు తెచ్చే విధంగా వ్యవహరిస్తుండడం, కొంత మంది పార్టీ ఎమ్మెల్యేలు అవినీతి వ్యవహారాల్లో మునిగి తేలుతూ ఉన్నారట.

మంత్రుల్లోనూ, చాలామంది తమకు అప్పగించిన శాఖలపై పట్టు సాధించకపోగా, మరెన్నో అవినీతి కేసుల్లో చిక్కుకోవడం ,వంటి వ్యవహారాలన్నీ వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారాయి.దీంతో జగన్ ఏ పేరు ప్రఖ్యాతుల కోసం అయితే ఇంతగా పాకులాడుతుంటాడో, ఆ పేరు ప్రఖ్యాతలు ఆయనకు దూరం అవుతున్నట్టుగా కనిపిస్తున్నాయి.

ఈ వ్యవహారాల కారణంగా జగన్ ఎంత కష్టపడుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ఆయన అనుకున్నంత స్థాయిలో ఫలితాలు రాకపోగా, అనవసర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుండడం, ఇవన్నీ జగన్ కు అన్ని రకాలుగానూ ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube