కృష్ణా జ‌లాల వివాదంలోకి జ‌గ‌దీశ్‌రెడ్డి ఎంట్రీ.. కేసీఆర్ ప్లాన్ ప్ర‌కార‌మేనా..?

ప్ర‌స్తుతం ఏపీ, తెలంగాణ మ‌ధ్య కృష్ణా జ‌లాల వివాదం ఏ స్థాయిలో కొన‌సాగుతుందో చూస్తూనే ఉన్నాం.కృష్ణా న‌దిపై క‌డుతున్న ఏపీ ప్రాజెక్టుల‌పై కేసీఆర్ ప్ర‌భుత్వం ఎప్పుడైతే న్యాయ‌పోరాటాలు చేస్తామ‌ని ప్ర‌క‌టించిందో అప్ప‌టి నుంచి ఒక్కొక్క‌రుగా తెలంగాణ మంత్రులు రంగంలోకి దిగుతున్నారు.

 Jagadish Reddy's Entry Into Krishna Waters Dispute  Is It According To Kcr Plan-TeluguStop.com

జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్నారు.మ‌రీ ముఖ్యంగా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నేత‌లు మొన్న‌టి వ‌ర‌కు తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు.

అయితే ఇదంతా కేసీఆర్ డైరెక్ష‌న్‌లోనే జ‌రిగిన‌ట్టు అంద‌ర‌కీ తెలిసినా.ఆయ‌న మాత్రం డైరెక్టుగా ఏపీ ప్ర‌భుత్వంపై వ్యాఖ్య‌లు చేయ‌ట్లేదు.

తాను వెన‌కుండి మంత్రుల‌తో చక్రం తిప్పుతున్న‌ట్టు తెలుస్తోంది.అయితే ఒక్కొక్కరుగా ఈ వివాదంలోకి ఎంట్రీ ఇస్తున్నారు.అదికూడా గులాబీ బాస్ ప్లాన్ ప్ర‌క‌రామే కేవ‌లం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, న‌ల్గొండ జిల్లాల నేత‌లు ఎంట్రీ ఇస్తున్నారు.ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌శాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు ఆ బాధ్య‌త తీసుకుంటే ఇప్పుడు తాజాగా మంత్రి జగదీశ్ రెడ్డి ఏపీ మంత్రుల‌కు కౌంటర్ ఇచ్చారు.

శ్రీశైలం డ్యామ్‌లో తెలంగాణ ప్ర‌భుత్వం చేపట్టిన జల విద్యుత్ ఉత్పత్తి ఆపేందుకు ప్రయత్నిస్తామని ఏపీ మంత్రులు చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు.

Telugu Ap Ycp, Ap, Ap Poltics, Jagadeesh Reddy, Jagan, Telengana, Ts, Ts Poltics

తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టిన శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తిని అడ్డుకోవ‌డం ఏపీ ప్ర‌భుత్వ తరం కాదని తేల్చి చెప్పారు. శ్రీశైలం డ్యామ్‌లో నీళ్లు ఉన్నంత వ‌ర‌కు విద్యుత్ ఉత్పత్తి చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.డ్యామ్‌లో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవ‌డం తెలంగాణకు ఉన్న హక్కు అని వివ‌రించారు.

త‌మ ప్ర‌భుత్వం త‌ప్ప‌కుండా ఆ ప‌ని చేసి తీరుతుంద‌ని వివ‌రించారు. జ‌గ‌న్ ప్రభుత్వం ఏకపక్షంగా, అహంకార ప‌ద్ధతిలో వ్యవహరించ‌డంపై ఆయ‌న మండిపడ్డారు.

ఎట్టి ప‌రిస్థితుల్లో తెలంగాణ వాటాల‌ను తీసుకుని తీరుతామ‌ని తేల్చి చెప్పారు మంత్రి.మొత్తానికి కేసీఆర్ ప్లాన్ బాగానే ప‌ని చేస్తోంది.

మ‌రి ఈయ‌న వ్యాఖ్య‌ల‌కు ఏపీ మంత్రులు ఏమైనా స్పందిస్తారో లేదో అన్న‌ది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube