ఇకపై హరీష్‌రావుతో గొడవలుండవు  

Jagaa Reddy Comments On Harish Rao-politiocal War Between Jagga Reddy And Harish Rao,trs

14 ఏళ్ల రాజకీయ వైరంను తన నియోజక వర్గం కోసం పక్కన పెడుతున్నట్లుగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పుకొచ్చాడు.సుదీర్ఘ కాలంగా టీఆర్‌ఎస్‌ ముఖ్య నేత హరీష్‌ రావుతో జగ్గారెడ్డికి విరోదాలు ఉన్నాయి.ఇద్దరు కూడా పలు సారు ఢీ అంటే ఢీ అంటూ గొడవకు దిగారు.

అలాంటి ఇద్దరు ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్బంగా దాదాపు 30 నిమిషాలు మాట్లాడుకున్నారు.14 ఏళ్ల తర్వాత వీరిద్దరు మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.ఇక తాజాగా మరోసారి ఆ విషయమై ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Jagaa Reddy Comments On Harish Rao-politiocal War Between Jagga Reddy And Harish Rao,trs Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage-Jagaa Reddy Comments On Harish Rao-Politiocal War Between Jagga And Rao Trs

ఇన్నాళ్లు హరీష్‌ రావుతో ఉన్న విభేదాలకు స్వస్థి చెప్పాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు.సంగారెడ్డి అభివృద్ది కోసం ఆయనతో కలిసి పని చేయాలని భావిస్తున్నాను.ఇకపై హరీష్‌ రావుతో ఎలాంటి విభేదాలు ఉండవని జగ్గారెడ్డి చెప్పుకొచ్చాడు.

Jagaa Reddy Comments On Harish Rao-politiocal War Between Jagga Reddy And Harish Rao,trs Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage-Jagaa Reddy Comments On Harish Rao-Politiocal War Between Jagga And Rao Trs

కేసీఆర్‌ ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజలు మరోసారి టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి గెలిపించారు.అందుకే మేమేం విమర్శించినా కూడా ప్రజలు నమ్మరు.అందుకే ఇకపై ప్రభుత్వంకు మద్దతుగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు.ఆయన వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌ వైపుకు దగ్గరగా ఆయన జరుగుతున్నారా అనే అనుమానాలను వ్యక్తం అయ్యేలా ఉన్నాయి.

మరి ముందు ముందు ఏం జరుగబోతుందో చూడాలి.