ఊర మాస్ లుక్ లో రచ్చ చేస్తున్న జడ్డు భాయ్..!

Jaddu Bhai Is Busy In The Village Mass Look

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పుష్ప సినిమా పై మనసు పారేసుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలోని పాటలు, డైలాగులతో సహా అల్లు అర్జున్ లుక్ ని జడేజా బాగా ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

 Jaddu Bhai Is Busy In The Village Mass Look-TeluguStop.com

తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఓ పోస్ట్ ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో జడేజా అల్లు అర్జున్ లుక్ ను కాపీ చేశారు.

అచ్చం అల్లు అర్జున్ లాగానే నోట్లో బీడీ పెట్టుకొని పొగ వదులుతూ ఇంటెన్స్ లుక్ తో జడేజా కేక పుట్టించాడనే చెప్పాలి.ప్రస్తుతం జడ్డు భాయ్ రిక్రియేషన్ లుక్ తెగ వైరల్ అవుతోంది.

 Jaddu Bhai Is Busy In The Village Mass Look-ఊర మాస్ లుక్ లో రచ్చ చేస్తున్న జడ్డు భాయ్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రవీంద్ర జడేజా తన పోస్టులో బీడీ తాగుతూ ఉన్న అల్లు అర్జున్ ఫొటోతో పాటు తన ఫొటోని షేర్ చేశాడు.‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా ఫైర్’ అని తెలుగులో జడేజా రాసుకొచ్చాడు.దీంతో తెలుగు సినీ ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు.దీనికి అల్లు అర్జున్ కూడా రిప్లై ఇచ్చారు.తగ్గేదే లేదంటూ అల్లు అర్జున్ పెట్టిన రిప్లై కూడా సెగలు పుట్టిస్తోంది.అయితే బీడీలు తాగడం ఆరోగ్యానికి హానికరమని.

తన ఫొటో కేవలం గ్రాఫిక్ రిప్రజెంటేషన్ మాత్రమే అని జడేజా తన అభిమానుల కోసం ఒక హెచ్చరిక కూడా తన పోస్టులో పెట్టాడు.దీంతో అతని కొత్త ఆలోచనకు అందరూ హ్యాట్సాఫ్ చెప్తున్నారు.

ఇప్పుడు పోస్టు నెట్టింట అభిమానులను ఫిదా చేస్తోంది.జడేజా ఊర మాస్ లుక్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం శిఖర్ ధావన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక రీల్‌ను పోస్ట్ చేసాడు.అందులో అతను పుష్ప రాజ్ డైలాగ్‌లకు లిప్ సింక్ ఇచ్చాడు.

గబ్బర్ అని ముద్దుగా పిలుచుకునే ధావన్, సినిమాలోని పాపులర్ డైలాగ్‌ని అద్భుతంగా చెప్పడం ఆశ్చర్యపరిచింది.జడేజా కూడా పుష్ప సినిమాలోని డైలాగ్ కు ఇంతకుముందు లిప్ సింక్ ఇచ్చాడు.

ప్రముఖ సెలబ్రిటీలతో పాటు కోహ్లీ, డేవిడ్ వార్నర్ వంటి చాలా మంది క్రికెటర్లు పుష్ప సినిమాలోని లుక్ ట్రై చేసి ఆకట్టుకున్నారు.ఇకపోతే ‘పుష్ప 2: ది రూల్’ ఫిబ్రవరి 2022లో పట్టాలెక్కుతుంది.మీరు ఇప్పటికీ ఈ చిత్రాన్ని చూడకుంటే, ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒరిజినల్ తెలుగు వెర్షన్‌లో చూసేయండి.

#Mass #Ravindra Jadeja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube