వావ్.. అమెరికా పిల్లల పాఠ్య పుస్తకాల్లో భారత ఫారెస్ట్ మ్యాన్ స్టోరీ..!

పచ్చదనం పరిశుభ్రత అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.ప్రస్తుతం పల్లెటూరు వాతావరణంలో మాత్రమే కాకుండా పట్టణాలు, నగరాల్లో కూడా వారి ఇంటి ఆవరణలో ఏదోవిధంగా పచ్చని వాతావరణం అందుకునేలా ప్రయత్నిస్తున్నారు ఎంతోమంది.

 Us School Adds Chapter On Assam's Jadav Payeng,jadav Payeng, Forest Man Of India-TeluguStop.com

ఇక అసలు విషయంలోకి వెళితే.భారతదేశ పద్మశ్రీ అవార్డు గెలుపొందిన జాదవ్ పాయెంగ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది అని చెప్పవచ్చు.

ఈయన ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా పేరు పొందిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.భారతదేశంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఆయన సేవలకు గాను భారతదేశ ప్రభుత్వం ఆయనను గుర్తించి పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

ఇక ఇది ఇలా ఉండగా తాజాగా అమెరికా లోనూ ఆయన గురించి తెలుసుకొనే సమయం వచ్చింది.

అమెరికా దేశంలోని ఆరో తరగతి చదువుతున్న పిల్లలకు జాదవ్ పాయెంగ్ గురించి పాఠ్యాంశంగా ఆయన జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చారు.

భారత్ కు చెందిన ఈయన గత 42 సంవత్సరాలుగా భారతదేశంలో పర్యావరణ కార్యకర్తగా పని చేస్తూ అందరి ప్రశంసలు అందుకున్నారు.అస్సాంలో జోర్హాట్ అనే పట్టణానికి కేవలం 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రపంచంలోనే నదిముఖ అతిపెద్ద ద్వీపం ఉంది.

ఈ ద్వీపంలో జాదవ్ గత 42 సంవత్సరాలుగా చెట్లను నాటుతూ ఏకంగా 550 హెక్టార్ల విస్తీర్ణంలో ఓ మానవుడు సృష్టించిన అడవిగా రికార్డు సృష్టించాడు.దీంతో ఆ రాష్ట్రంలో ఎంతో పచ్చదనం నెలకొంది.

ఇక ఈ విషయం సంబంధించి అమెరికా లోని బ్రిస్టల్ గ్రీన్ హిల్స్ పాఠశాల ఆయన జీవిత చరిత్రను ఆరో తరగతి సిలబస్ లో చేర్చింది.ఈ విషయం సంబంధించి తాజాగా ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు నవమి శర్మ మీడియాతో మాట్లాడుతూ.

ఎకాలజీ లెసన్స్ లో భాగంగా పిల్లలకు పద్మశ్రీ అవార్డు గెలుచుకున్న జాదవ్ గురించి తెలుసుకుంటున్నట్లు ఆవిడ తెలియజేశారు.ఓ వ్యక్తి ప్రపంచం పై సానుకూల ప్రభావాన్ని ఎలా చూపగలిగాడు అన్న ఈ విషయంపై భవిష్యత్తు తరాలకు ఆయన గురించి తెలపాలని ఉద్దేశంతోనే ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా జీవిత చరిత్రను ఇక్కడి పిల్లలకు బోధిస్తున్నట్లు ఆవిడ తెలిపారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న అస్సాం ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube