పవన్ కోసం 40 రోజులే అంటోన్న బ్యూటీ  

Jacqueline Fernandez To Pair Pawan Kalyan For Krish Movie - Telugu Jacqueline Fernandez, Krish, Pawan Kalyan, Telugu Movie News

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ రిలీజ్‌కు రెడీగా ఉంది.ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకోవాల్సి ఉంది.

 Jacqueline Fernandez To Pair Pawan Kalyan For Krish Movie

ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే పవన్ తన నెక్ట్స్ మూవీని దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో మొదలుపెట్టాడు.ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రారంభించిన చిత్ర యూనిట్, ఈ సినిమాలో హీరోయిన్‌ కోం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

కాగా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండెజ్‌ను ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈమె, ఇటీవల ప్రభాస్ నటించిన సాహో చిత్రంలో ‘బ్యాడ్ బాయ్’ అనే పాటలో చిందులు వేసిన సంగతి తెలిసిందే.

పవన్ కోసం 40 రోజులే అంటోన్న బ్యూటీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

బాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల్లోనూ తన సత్తా చాటాలని ఈ బ్యూటీ చూస్తోందట.అందుకే పవన్ సరసన హీరోయిన్‌గా నటించేందుకు వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే పవన్ సినిమా కోసం ఆమె కేవలం 40 రోజుల కాల్షీట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే.

ఇక ఈ సినిమా షూటింగ్‌ను లాక్‌డౌన్ తరువాత ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు