పవన్ సినిమాలో అమ్మడి పాత్ర అదేనా?  

Jacqueline Fernandez Pawan Kalyan Krish Pspk27 - Telugu Jacqueline Fernandez, Krish, Pawan Kalyan, Pspk27

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో రీఎంట్రీ ఇస్తుండటంతో ఆయన సినిమాలను ఎప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రాన్ని రిలీజ్‌కు రడీ చేస్తున్న పవన్, తన నెక్ట్స్ మూవీని దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు.

 Jacqueline Fernandez Pawan Kalyan Krish Pspk27

ఈ సినిమాను ఇప్పటికే ప్రారంభించిన చిత్ర యూనిట్, త్వరలో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

ఇక ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే అంశంపై గతకొద్ది రోజులుగా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండెజ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

పవన్ సినిమాలో అమ్మడి పాత్ర అదేనా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఆమె ఈ సినిమాలో నటించేందుకు 41 రోజుల కాల్షీట్లు కూడా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.కాగా ఈ సినిమాలో అమ్మడు ఓ మహారాజుకు సోదరి పాత్రలో నటిస్తుందట.

ఇదొక పీరియాడికల్ మూవీగా వస్తుండటంతో ఇలాంటి పాత్రలను క్రిష్ ఎలా చూపిస్తాడా అనే ఆసక్తి పవన్ ఫ్యాన్స్‌లో నెలకొంది.

అటు పవన్ ఈ సినిమాలో రాబిన్‌హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నాడు.

ప్రజలకు మేలు చేసే పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తాడని చిత్ర యూనిట్ అంటోంది.ఈ సినిమాను తమిళ నిర్మాత ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jacqueline Fernandez Role In Pawan Kalyan Movie Related Telugu News,Photos/Pics,Images..