చిరు 150వ సినిమాలో హీరోయిన్ వేట ఇంకా కొనసాగుతూనే ఉంది.లేటెస్ట్ గా బాలీవుడ్ భామలు నర్గీస్ ఫక్రి, జాక్వలిన్ ఫెర్నాండేజ్ లతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తుంది.
మొన్నటిదాకా నర్గీస్ మీద ఊపు చేసిన చిత్రయూనిట్ ఇప్పుడు జాక్వలిన్ తో చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.శ్రీలంక నుండి వచ్చి బాలీవుడ్లో సెటిల్ అయిన ఈ భామ బీ టౌన్ హాట్ ఇమేజ్ తో టాపు లేపుతుంది.
అయితే సౌత్ సినిమాలంటే బాలీవుడ్ హీరోయిన్ భారీ డిమాండ్ చేయడం మాములే.ఆ క్రమంలో జాక్వలిన్ కూడా చిరు సినిమా కోసం అడిగితే చేస్తా అన్నది కాని అమ్మడు రెమ్యునరేషన్ మాత్రం 5 కోట్లు కావాలని అన్నాదట.
మరి అంత రేంజ్ ఇచ్చి ఆమెను తెచ్చుకునే కంటే దీపికా, ప్రియాంకలనే ఒప్పిచ్చే అవకాశం ఉంది.మరి సౌత్ సినిమా అనగానే ఓ రేంజ్ లో బీ టౌన్ హాట్ భామలు చెప్పడం కాస్త విచిత్రంగానే ఉంది.
ఇక ఆమె చెప్పిన ఫిగర్ కు షాక్ తిన్న చిత్రయూనిట్ మరోసారి ఆలోచనలో పడ్డారట.ఓ పక్క సినిమా షూటింగ్ జరుపుతున్నా మరో పక్క చిరంజీవి పక్కన హీరోయిన్ కోసం గాలింపు జరుగుతూనే ఉంది.
మరి ఫైనల్ గా ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో ఏమో చూడాలి.
.