అనసూయను అలా అనడం నా తప్పే: వర్ష

బుల్లితెరపై ఈటీవీ సీరియళ్లలో నటించి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వర్ష.గత కొన్ని వారాల నుంచి జబర్దస్త్ షోలో హైపర్ ఆది, ఇతర టీం లీడర్ల స్కిట్లలో కనిపిస్తూ వర్ష పాపులర్ అవుతోంది.

 Jabradasth Varsha Claritya About Viral Video In Social Media,anasuya , Jabadasth-TeluguStop.com

అయితే జబర్దస్త్ షోలోకి వర్ష రావడంతో త్వరలో యాంకర్ అనసూయ స్థానంలో ఆమెను తీసుకోబోతున్నారని ప్రచారం జరిగింది.మూడేళ్ల క్రితం అనసూయను తిడుతూ వర్ష సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో మళ్లీ వైరల్ అయింది.

అనసూయకు, వర్షకు మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో వర్ష లైవ్ లోకి వచ్చి వైరల్ అవుతున్న వీడియో గురించి స్పందించారు.అనసూయ గురించి తెలియక ఆ విధంగా అన్నానని.

అనసూయ గురించి అలా మాట్లాడటం తన తప్పేనని చెప్పారు.రెండేళ్ల క్రితం ఒక అబ్బాయి సెల్ఫీ అడగగా అనసూయ ఫోన్ ను విసిరేసింది.

దీంతో కొందరు నెటిజన్లు అనసూయను అప్పట్లో ట్రోల్ చేశారు.

అయితే అనసూయ ఆ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వడంతో ఆ వివాదం సద్దుమణిగింది.

అయితే ఆ సమయంలో వర్ష అనసూయకు కూడా పిల్లలు ఉన్నారని.ఆ పిల్లలు ఎవరైనా స్టార్ హీరోలతో ఫోటో దిగాలని ప్రయత్నిస్తే అనసూయకు ఎలా ఉంటుందో ఫోటో దిగడానికి వచ్చిన బాబు, వాళ్ల పేరెంట్స్ కూడా అలాగే ఫీల్ అవుతారని పేర్కొంది.

అనసూయను ఘోరంగా అవమానించేలా వర్ష మాట్లాడింది.

Telugu Anasuya, Jabardasth, Serialactress-Movie

అయితే ప్రస్తుతం వర్ష, అనసూయ ఒకే షోలో పాల్గొంటూ ఉండటంతో కొందరు ఆమె వీడియోను వైరల్ చేస్తున్నారు.దీంతో వర్ష అనసూయకు గతంలో ఒక షోలో సారీ చెప్పానని.ఆమె లైట్ తీసుకుందని తెలిపారు.

తనకు, తనలాంటి ఎంతోమందికి అనసూయ సాయం చేసిందని.అనసూయను అలా అన్నందుకు ఇప్పటికీ ఫీల్ అవుతున్నానని వర్ష చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube