జబర్దస్త్ స్టేజ్ పై చేసేది ఒకటి.. తెరవెనుక జరిగేది ఒకటి?

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందుతున్న షో జబర్దస్త్ అందరికీ తెలిసిందే.ఇప్పటి వరకు చాలా మందికి మంచి లైఫ్, మంచి పేరును కూడా సంపాదించి పెట్టింది.

 Jabardasth This Is The One Thing On Stage To Happen Behind The Scenes,  Jabardas-TeluguStop.com

అలా కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడంలో ఆ ప్రొడక్షన్ ఎప్పుడూ ముందుంటుందనే చెప్పాలి.అలా ఈ మధ్య తెలుగు అభిమానులకు పరిచయమైన జబర్దస్త్ లో ఒక టీం మెంబర్ ఫైమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తన వినూత్న స్లాంగ్ తో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తూ ఇటీవలి కాలంలో ట్రెండింగ్ లోనూ నిలుస్తున్నారు ఫైమా.అలా షోలో స్కిట్స్ చేస్తున్న ఫైమా తన టీం లీడర్ భాస్కర్ గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

జబర్దస్త్ స్టేజ్ పై చేసేటపుడు కూడా ఇలా తిడతాను అని నేను అంటే, అడుగుతావేంటమ్మా ఏమన్నా తిట్టు అని అనే అంత ఫ్రీడమ్ భాస్కర్ అన్న ఇస్తాడని ఫైమా తెలిపారు.స్కిట్ అసలు అనుకున్న ప్రకారం వెళ్ళదని.

ఒక్కోసారి మధ్యలో ఎవరైనా కల్పించుకుంటే అది వేరేలా వెళ్ళిపోతుందని ఆమె అన్నారు.కానీ భాస్కరన్న స్కిట్ లో కథ ఉంటుంది.

కొన్ని కీ పాయింట్స్ తీసుకొని స్కిట్ ని చేస్తారని ఆమె వివరించారు.అంటే స్కిట్ కి స్టార్టింగ్, మిడిల్, కంక్లుషన్ ఇలా ఉంటాయి.

అందులో మధ్యలో ఏమైనా చేయండని ఆయన చెప్తారని ఫైమా అన్నారు.దానికి వాళ్ళు నవ్వినా నవ్వకపోయినా నీకు ఏదనిపిస్తే అది మాట్లాడు.

దానికి వాళ్ళు కనెక్ట్ అయితే దాన్ని డబుల్ చేయమని భాస్కర్ అన్న బాగా ఎంకరేజ్ చేస్తారని ఆమె చెప్పారు.

Telugu Aadi, Stage, Bullet Bhaskar, Faima, Faimabullet, Jabardast, Roja, Show, S

వీళ్ళతో పాటు మిగతా వాళ్ళు సుధీర్, రామ్ ప్రసాద్, శ్రీను, ఆది ఇలా అందరూ తనకు మంచి ఎంకరేజ్ మెంట్ ఇస్తారని ఫైమా అన్నారు.రోజా గారు కూడా బాగా చూస్కుంటారని తెలిపారు.ఇప్పటి వరకు వివిధ ఛానెల్స్ లో ఎన్ని షోలు చేసినా ఇంత పేరు రాలేదని ఆమె అన్నారు.

అంతే కాకుండా జబర్దస్త్ తనకు మంచి పేరును కూడా తీసుకు వచ్చిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.మనం కావాలనుకున్నంత డబ్బులు రాకపోయినా… ఇక్కడ వచ్చిన పేరుతో ఎక్కడికైనా వెళ్లి బతకొచ్చని ఫైమా విశ్వాసం వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube