నిశ్చితార్థం చేసుకున్న జబర్దస్త్ వినోదిని... మరి పెళ్లి ఎప్పుడంటే....

ప్రతి గురు,శుక్ర వారాల్లో ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో లో లేడీ గెటప్ లు వేస్తూ తెలుగు ప్రేక్షకులను తన కామెడీతో ఎంతగానో అలరించే టువంటి వినోద్ అలియాస్ వినోదిని గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే వినోద్ ఒక జబర్దస్త్ లోనే కాక అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కనిపిస్తున్నాడు.

 Jabardasth Vinod,  Marriage News, Jabardasth Vinodini, Etv, Extra Jabardasth-TeluguStop.com

 అయితే తాజాగా జబర్దస్త్ వినోద్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.ఇందులో భాగంగా పలు అంశాలను తెలుగు ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే ఇందులో భాగంగా తాను తొందర్లోనే పెళ్లి చేసుకోబోతున్నానని పెళ్లికూతురు తన సమీప బంధువు అని తెలిపాడు.అలాగే ఇటీవలే వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా అయినట్లు కూడా ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే తాజాగా తన పై దాడి జరగడంతో పెళ్లిని కొంతకాలం పాటు వాయిదా వేసుకోవలసి వచ్చిందని తెలిపాడు.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్నడంతో మరోమారు తన పెళ్ళి వాయిదా పడినట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం జబర్దస్త్ వినోద్ బాలీవుడ్ హాట్ హీరోయిన్ పూనం పాండే నటిస్తున్న ఓ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నాడు.అంతేగాక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించినటువంటి కొన్ని సన్నివేశాల చిత్రీకరణలో కూడా పాల్గొన్నాడు.

అయితే అతి తక్కువ కాలంలో బాలీవుడ్ లో ఛాన్స్ దక్కించుకున్న జబర్దస్త్ వినోద్ ఈ చిత్రం కోసం బాగానే కష్టపడుతున్నాడు.

అయితే మొదట్లో తనకు అన్నం పెట్టినటువంటి జబర్దస్త్ షోని వదలకుండా అందులో కూడా నటిస్తున్నాడు.

దీంతో ప్రస్తుతం జబర్దస్త్ వినోద్ ఒక వైపు సినిమాల్లో మరో వైపు జబర్దస్త్ షోలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube