ఈ జబర్దస్త్ కమెడియన్ బాత్ రూమ్ లు కూడా కడిగారట.. అలాంటి కష్టాలతో?

సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటులు సంతోషంగా జీవనం సాగిస్తారని మనలో చాలామంది భావిస్తారు.అయితే ఆయా నటులు గొప్ప స్థానాలకు చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉంటుంది.

 Jabardasth Venu Facing So Many Problems In Career Starting Stage-TeluguStop.com

జబర్దస్త్ షోలో కమెడియన్ గా చేసిన వేణు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యాక్టర్ కావాలని ఇండస్ట్రీకి వచ్చానని అయితే 24 క్రాఫ్ట్స్ ఉంటాయని కానీ యాక్టింగ్ గురించి కానీ తనకు ఏమీ తెలియదని వేణు అన్నారు.

తాను చిత్రం శ్రీను దగ్గర రెండు సంవత్సరాలు టచప్ బాయ్ గా చేశానని చూడాలని ఉంది సినిమాలో కలకత్తా సెట్ కు రోజుకు 70 రూపాయల జీతానికి పని చేశానని వేణు చెప్పుకొచ్చారు.

 Jabardasth Venu Facing So Many Problems In Career Starting Stage-ఈ జబర్దస్త్ కమెడియన్ బాత్ రూమ్ లు కూడా కడిగారట.. అలాంటి కష్టాలతో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కూలీలాగా సెట్స్ కోసం పని చేశానని వేణు తెలిపారు.స్క్రీన్ పై కనిపించాలని అనుకున్నా రూట్ తెలీదని తనలా పారిపోయి వచ్చిన వాళ్లు చాలామంది ఉండేవారని వేణు వెల్లడించారు.

తాను మార్షల్ ఆర్ట్స్ చేశానని 18 సంవత్సరాలకే కోచ్ అని వేణు చెప్పారు.

ఫైటర్ కావాలనుకుంటే కార్డు కావాలని తర్వాత తెలిసిందని వేణు చెప్పుకొచ్చారు.ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులతో ఉంటే అవకాశాలు వస్తాయని భావించి వంట చేస్తూ, బట్టలు ఉతుకుతూ ఉంటానంటే తనను బాయ్ లాగా ఉంచుకున్నారని వేణు చెప్పారు.నవకాంత్ గారి దగ్గర తాను పనిచేశానని దాదాపు అన్ని డిపార్టుమెంట్లకు పని చేశానని వేణు తెలిపారు.

బాత్ రూమ్ లు కడగడం, అంట్లు తోమడం కూడా చేశానని వేణు తెలిపారు.

తను ఇండస్ట్రీలో పడిన కష్టాల గురించి వేణు చెప్పుకొచ్చారు.కెరీర్ లో కష్టాలు పడిన తరువాత కమెడియన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన వేణు తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.జబర్దస్త్ షోతో పాటు పలు షోలు, ఈవెంట్లు చేసి కమెడియన్ గా వేణు మంచి పేరును సొంతం చేసుకున్నారు.

#Venu Tillu #Comments #Jabardasth Vneu #Touchup Boy #Problems

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు