ఫస్ట్ నాకు మగపిల్లాడు కావాలి.. వైరల్ అవుతున్న వర్ష షాకింగ్ కామెంట్స్!

బుల్లితెర కామెడీ షోలలో నంబర్ వన్ షో ఏదనే ప్రశ్నకు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోల పేర్లు వినిపిస్తాయి.ఎన్నో కామెడీ షోలు బుల్లితెరపై వచ్చినా ఆ షోలు ఈ రెండు షోలకు నామమాత్రపు పోటీని ఇవ్వడంలో కూడా ఫెయిల్ అవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.

 Jabardasth Varsha Shocking Comments Goes Viral In Social Media Details, Jabardas-TeluguStop.com

జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న వర్ష తాజాగా ప్రోమోలో చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రోమోలో సత్తిపండు, వర్ష జంటగా కనిపించారు.

వర్ష సత్తిపండుతో ఫస్ట్ మనకు మగపిల్లాడు కావాలి అని చెప్పగా కుదరదే మనకు అమ్మాయే పుట్టాలంటూ సత్తిపండూ కామెంట్ చేశాడు.ఎందుకు అని వర్ష అడగగా మా ఆఫీస్ లో ఒక కండీషన్ ఉందని ఇంట్లో ముగ్గురు అబ్బాయిలు ఉంటే లోన్ ఇవ్వరని చెప్పాడు.

వర్ష వెంటనే మన ఇంట్లో ముగ్గురు అబ్బాయిలు ఎక్కడ ఉన్నారని అడగగా నువ్వు, నేను, పుట్టబోయే అబ్బాయి అని సత్తిపండు చెబుతాడు.

Telugu Sattipandu, Jabardasth, Lady Varsha, Varsha-Movie

ఆ తర్వాత వర్ష వంట చెయ్యాలి నేను బయటకు వెళ్లి కూరగాయలు తీసుకొనిరండి అని చెప్పగా ఆన్ లైన్ లో ఆర్డర్ చెయ్యి అని సత్తిపండు చెబుతాడు.మీరు బయటికి వెళ్లి కూరగాయలు తీసుకురండి అని వర్ష చెప్పగా ఒక్కసారి బయటకి వెళ్లినందుకే అందరి కాళ్లు పట్టుకుని లోపలికి వచ్చానని మళ్లీ ఎవరి కాళ్లు పట్టుకోలేనని సత్తిపండు కామెంట్ చేశారు.ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Telugu Sattipandu, Jabardasth, Lady Varsha, Varsha-Movie

అయితే ప్రోమోలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువయ్యాయని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఈ ప్రోమోకు 2 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.జబర్దస్త్ వర్షకు రోజురోజుకు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.వర్ష రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube