జబర్దస్త్'లో నడుము అందాలతో మత్తెక్కిస్తున్న కొత్త పిల్ల!

దాదాపు ఏడు సంవత్సరాల నుంచి బుల్లితెరపై నంబర్ 1 కామెడీ షోగా జబర్దస్త్ షో విజయవంతంగా ప్రసారమవుతోంది.ఎంతోమంది కమెడియన్లు ఈ షో ద్వారా గుర్తింపు తెచ్చుకుని సినిమాల్లో నటిస్తూ, ఈవెంట్లు చేస్తూ ఆర్థికంగా స్థిరపడుతున్నారు.

 Jabardasth Varsha Photos Goes Viral In Social Media, Varsha, Hyper Adhi, Venkymo-TeluguStop.com

అయితే జబర్దస్త్ షోలోని స్కిట్లలో గతంలో లేడీ వేషం వేయాల్సి వచ్చినా మగవాళ్లే వేసేవాళ్లు.అయితే ఈ మధ్య కాలంలో అమ్మాయిలే లేడీ వేషాలు వేస్తూ కామెడీ చేస్తున్నారు.

ఇప్పటికే జబర్దస్త్, ఎక్స్టా జబర్దస్త్ ద్వారా అనసూయ, రష్మీ పేరు, గుర్తింపు సంపాదించుకొగా ప్రస్తుతం వర్ష అనే యంగ్ బ్యూటీ జబర్దస్త్ షోలో కనిపిస్తోంది.హైపర్ ఆది స్కిట్లలో ఎక్కువగా కనిపించే వర్ష నడుము అందాలు చూపిస్తూ స్కిట్స్ లో గ్లామర్ షో చేస్తోంది.

హైపర్ ఆది స్కిట్లతో పాటు రాకింగ్ రాకేష్, వెంకీ మంకీస్ టీంలలో కూడా స్కిట్లు చేస్తూ వర్ష పాపులర్ అవుతోంది.జబర్దస్త్ ఫ్యాన్స్ వర్ష కామెడీని కూడా అద్భుతంగా పండిస్తోందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ఈటీవీలోని పలు సీరియళ్లలో మంచి పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న వర్ష చాలా సంవత్సరాల నుంచి బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే.వర్ష షోకు ప్లస్ కావడంతో కొందరు నెటిజన్లు జబర్దస్త్ షోలో లేడీ వేషాలకు అమ్మాయిలను తీసుకుంటేనే బాగుంటుందని ఫలితంగా ఇండస్ట్రీకి సైతం మంచి లేడీ కమెడియన్లు దొరికే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు.

జబర్దస్త్ షోకు వచ్చిన తరువాత వర్షకు పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.ఆమె గ్లామర్ గురించి సోషల్ మీడియాలో ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సీరియళ్ల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు రాగా వర్ష ఈ గుర్తింపును ఏ విధంగా ఉపయోగించుకుంటుందో చూడాల్సి ఉంది.అనసూయ, రష్మీలా సోషల్ మీడియాలో వర్ష కూడా ఫ్యాన్ బేస్ ను పెంచుకుంటూ ఉండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube