అలాంటి ఫోటో షేర్ చేసిన వర్ష.. అవాక్కైన ఫ్యాన్స్..?

ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే కొన్ని సీరియళ్లలో నటించిన వర్ష జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.మంచి కామెడీ టైమింగ్ ఉండటం, ఇమ్మాన్యుయేల్ తో వర్ష చేసిన స్కిట్లు కూడా హిట్ కావడంతో ఆమెకు మంచి పేరు వచ్చింది.

 Anchor Varsha Shares Glamourous Photo In Social Media ,e Tv ,tollywood News,jaba-TeluguStop.com

సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే వర్ష తన ఫోటోలను షేర్ చేస్తూ పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారు.అయితే తాజాగా వర్ష టాప్ లెస్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ ఫోటోలో వీపుపై ఉన్న టాటూను చూపిస్తూ వర్ష ఫోటో షూట్ ల ద్వారా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.వర్ష షేర్ చేస్తున్న గ్లామర్ ఫోటోలను చూసి ఆమె అభిమానులు అవాక్కవుతున్నారు.

బుల్లితెరపై సత్తా చాటిన వర్ష వెండితెరపై కూడా సత్తా చాటాలనే ఆలోచనతోనే అందాలను ఆరబోస్తున్న ఫోటోలను షేర్ చేస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికే జబర్దస్త్ యాంకర్లు అనసూయ, రష్మీ పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.

అనసూయ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు హిట్ కాగా రష్మీ నటించిన సినిమాలలో గుంటూరు టాకీస్ మినహా మరే సినిమా హిట్ కాలేదు.మరి వర్ష సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తారో లేక ఇతర పాత్రలతో ఎంట్రీ ఇస్తారో తెలియాల్సి ఉంది. జబర్దస్త్ షో ద్వారా వర్ష క్రేజ్ అమాంతం పెరుగుతోంది.రష్మీ సుధీర్ లా ఇమ్మాన్యుయేల్ వర్ష కలిసి చేస్తున్న కామెడీ స్కిట్లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

సంక్రాంతి పండుగకు ఈటీవీలో ప్రసారమైన అత్తో అత్తమ్మ కూతురు ఈవెంట్ లో కూడా ఇమ్మాన్యుయేల్ వర్ష జోడీ హైలెట్ గా నిలిచారు.ఇమ్మాన్యుయేల్ వర్ష మధ్య ప్రేమ బంధం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నా ఇతర జబర్దస్త్ కమెడియన్లు మాత్రం వాళిద్దరి మధ్య ఏం లేదని అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube