వర్ష చనిపోయిందంటూ యూట్యూబ్ లో పుకార్లు.. దాంతో ఇమ్మానుయేల్ ఏకంగా అర్థ రాత్రి... 

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన ఈ టీవీ ఛానల్ లో ప్రతి శుక్రవారం రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారమయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ షో లో తన స్కిట్లతో  ప్రేక్షకులని ఎంతగానో అలరించే ఇమ్మానియేల్ మరియు వర్ష ల గురించి బుల్లితెర ప్రేక్షకులకు మరియు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే గతంలో “సుడిగాలి సుధీర్ మరియు రష్మి గౌతమ్ ల” జోడి మాదిరిగానే ప్రస్తుతం ఇమ్మానియేల్ మరియు వర్ష ల జంట బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది.దీనికితోడు ఇమ్మానియేల్ అమాయకత్వం, వర్ష ప్రేమ వీరిద్దరిని చాలా హైలెట్ చేస్తోంది.

 Jabardasth Varsha Death Fake News News Viral, Varsha, Jabardasth Artist, Emmanue-TeluguStop.com

అయితే వచ్చేవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ ప్రోమో ని ఇటీవలే షో నిర్వాహకులు యూట్యూబ్లో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా వర్ష, ఇమ్మానియేల్ పై ఉన్నటువంటి ప్రేమని వ్యక్త పరిచింది.

ఇందులో భాగంగా ఎందుకు తనకు ఇమ్మానియేల్ అంటే అంత ప్రేమ అనే విషయం గురించి కూడా స్పందించింది.ఇటీవలే కొందరు తన గురించి యూట్యూబ్ లో “వర్ష మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని తప్పుడు ప్రచారాలు చేశారని, దీంతో ఇది తెలుసుకున్న ఇమ్మానియేల్ అర్థ రాత్రి సమయంలో ఫోన్ చేసి తను ఎక్కడున్నానని తన యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నాడని అంతగా తనని ప్రేమగా చూసుకుంటూ తన పట్ల బాధ్యతగా ప్రవర్తిస్తాడని అందుకే తనకు ఇమ్మానియేల్ అంటే చాలా ఇష్టమని తన ప్రేమను వ్యక్త పరిచింది.

దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ పాపులర్ కావాలని కొందరు చూస్తున్నారని  అలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోవద్దని సూచిస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఇమ్మానియేల్ జబర్దస్త్ కామెడీ షోలో కమెడియన్ గా  పని చేస్తూనే పలు రకాల షోలు,  ఈవెంట్లలో కూడా నటిస్తూ బాగానే సంపాదిస్తున్నాడు.

ఇక వర్ష కూడా జబర్దస్త్ లో కమెడియన్ గా పనిచేస్తూనే హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకోవడం కోసం ప్రయత్నిస్తోంది.  ఇందులోభాగంగా అప్పుడప్పుడు ఘాటుగా ఫోటోషూట్లు కూడా చేస్తూ తన అందాల ఆరబోతతో కుర్రకారును కట్టి పడేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube