జబర్దస్త్ స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ.. అసలేమైందంటే..?

బుల్లితెర షోలలో ఒకటైన జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ షో ద్వారానే ఈవెంట్లలో అవకాశాలను అందిపుచ్చుకుంటూ జబర్దస్త్ కమెడియన్లు భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నారు.

 Jabardasth Team Leader Venky Emotional On Jabardasth Stage, Emotional Comments,-TeluguStop.com

జబర్దస్త్ షో టీమ్ లీడర్లలో వెంకీ ఒకరు కాగా వెంకీ మంకీస్ పేరుతో ఈ టీమ్ చేస్తున్న స్కిట్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం.

అయితే తాజాగా వెంకీ జబర్దస్త్ షోలో స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకోవడంతో పాటు ఎమోషనల్ అయ్యారు.

మనో ఏం వెంకీ ఏమైంది అని అడగగా చేసేది నేను చేయించేది నేనని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.అయితే అసలేం జరిగిందో తెలియాలంటే మాత్రం వచ్చే జబర్దస్త్ షో ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే.

వెంకీ మంకీస్ టీమ్ నుంచి పేరు తెచ్చుకున్న జీవన్ ప్రస్తుతం టీమ్ లీడర్ స్థాయికి ఎదిగారు.

ప్రస్తుతం వెంకీ మంకీస్ టీమ్ లో తాగుబోతు రమేష్ కూడా చేస్తున్నారు.

అయితే వెంకీ తనకు అనుకున్న స్థాయిలో పేరు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారో లేక వెంకీ అసంతృప్తి వ్యక్తం చేయడానికి ఇతర కారణాలేమైనా ఉన్నాయేమో చూడాల్సి ఉంది.అయితే జబర్దస్త్ నిర్మాతలు ఈ మధ్య కాలంలో ఇలా టీమ్ లీడర్ల ద్వారా ఏం చెప్పాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదని నెటిజన్ల కామెంట్లు వినిపిస్తున్నాయి.

జబర్దస్త్ టీమ్ లీడర్లలో ఏదైనా అసంతృప్తి ఉన్నా స్టేజ్ పై మాత్రం వాళ్లు ఎప్పుడూ ఆ అసంతృప్తిని వ్యక్తపరచలేదు.కొంతమంది కమెడియన్లు టీమ్ లీడర్లపై ఫన్నీగా చేసిన కామెంట్లు సైతం గతంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.తాజాగా వర్ష కూడా జబర్దస్త్ స్టేజ్ పై ఎమోషనల్ అవుతూ ఈ షోకు గుడ్ బై చెబుతానని కామెంట్లు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube