నాలుగేళ్ల క్రితం ఓ సర్జరీ జరిగింది.. కన్నీటి కష్టాలు చెప్పుకున్న సుడిగాలి సుధీర్!

జబర్దస్త్ షో ద్వారా గుర్తింపును, పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో సుడిగాలి సుధీర్ ఒకరనే సంగతి తెలిసిందే.తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ 2022 సంవత్సరం ఫిబ్రవరికి జబర్దస్త్ షోలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తవుతాయని జనాలకు హాస్యం ఇవ్వాలనే ఆరాటంతో తాను పని చేస్తున్నానని సుడిగాలి సుధీర్ చెప్పుకొచ్చారు.

 Jabardasth Sudigali Sudheer Comments Abotu His Career Troubles  Details, Jabarda-TeluguStop.com

జబర్దస్త్ స్కిట్ల కోసం శీను మంచి లైన్ చెబుతాడని రామ్ ప్రసాద్ చకచకా రాస్తాడని తన పని తక్కువేనని డిస్కషన్ లో ఆలోచనలను పంచుకుంటానని సుధీర్ అన్నారు.

మొదట జబర్దస్త్ షోను 13 ఎపిసోడ్లుగా చేయాలని అనుకున్నారని రష్మీతో లవ్ ట్రాక్ వల్ల ఎంతో పేరొచ్చిందని సుధీర్ అన్నారు.

ప్రేక్షకులను రంజింపజేయాలనే ఆలోచనతోనే తమ లవ్ ట్రాక్ ఉందని సుధీర్ కామెంట్లు చేశారు.తాను, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ ఫ్రెండ్స్ కంటే ఫ్యామిలీ మెంబర్స్ అవుతారని ఏదో మ్యాజిక్ తమను కలిపిందని సుధీర్ చెప్పుకొచ్చారు.

జబర్దస్త్ షోకు ముందే గెటప్ శ్రీను తనకు స్నేహితుడని సుధీర్ అన్నారు.

వేణు అన్నకు గెటప్ శ్రీను తనను రిఫర్ చేశారని ఆ తర్వాత రామ్ ప్రసాద్ పరిచయమయ్యాడని సుధీర్ పేర్కొన్నారు.

Telugu Auto Ram Prasad, Career Troubles, Getup Srinu, Jabardast Show, Rashmi, Su

కష్టాలు ఉంటేనే లైఫ్ విలువ తెలుస్తుందని భోజనానికి డబ్బులు లేని రోజులు ఉన్నాయని సింక్ లోని నీళ్లు తాగిన నిమిషాలు ఉన్నాయని సుధీర్ అన్నారు.నాలుగేళ్ల క్రితం ఒక సర్జరీ జరిగిందని ఇలా కష్టాలు ఎప్పుడూ తమతోనే ఉన్నాయని సుధీర్ కామెంట్లు చేశారు.

Telugu Auto Ram Prasad, Career Troubles, Getup Srinu, Jabardast Show, Rashmi, Su

సుధీర్ తనది విజయవాడ అని నాన్న సినిమా హాల్ మేనేజర్ గా పని చేసేవారని చిన్నప్పుడు మేనమామ దగ్గర తాను మ్యాజిక్ నేర్చుకున్నానని తెలిపారు.మ్యాజిక్ లో నేషనల్ అవార్డులు, రాష్ట్ర స్థాయి అవార్డులు గెలుచుకున్నానని సుధీర్ చెప్పుకొచ్చారు.తనకు, శ్రీనుకు, రామ్ ప్రసాద్ కు మధ్య ఈగోలు లేవని అపార్థం చేసుకోమని సుధీర్ తెలిపారు.పది మంది జీవితాలను నిలబెట్టే స్థాయికి ఎదగడమే నిజమైన సక్సెస్ అని సుధీర్ చెప్పుకొచ్చారు.

అనాథాశ్రమాలను, ఓల్డేజ్ హోమ్స్ ను ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని సుధీర్ పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube