పదేళ్లు పూర్తి చేసుకున్న జబర్దస్త్ షో... ఎమోషనల్ కామెంట్స్ చేసిన గెటప్ శ్రీను!

బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్యక్రమాలలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి.ఇలా ఈ కార్యక్రమం 2013 వ సంవత్సరంలో ప్రారంభమైంది.

 Jabardasth Show That Has Completed Ten Years Getup Srinu Who Made Emotional Comm-TeluguStop.com

ఇలా ఈ కార్యక్రమం గత పది సంవత్సరాల నుంచి ప్రసరమవుతూ ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇకపోతే ఈ కార్యక్రమా ద్వారా ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమయి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటూ ప్రస్తుతం వెండితెర సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఇక ఈ కార్యక్రమం ప్రారంభమై 10 సంవత్సరాలు పూర్తి కావడంతో జబర్దస్త్ కమెడియన్స్ ఈ కార్యక్రమం పై స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో గెటప్ శ్రీను ఒకరు.ఈ క్రమంలోనే గెటప్ శీను సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… ఫిబ్రవరి 7, 2013 మా తలరాతలు మార్చిన రోజు,మాలో వున్నా సత్తాను చాటుకునే అవకాశం వచ్చిన రోజు, ముఖ్యంగా జబర్ధస్త్ ప్రేక్షకుల ఇంట్లో కుటుంబ సభ్యులమైన రోజు ,జబర్దస్త్ మొదలైన రోజు ఈరోజు.మా జబర్దస్త్ నటన నేర్పింది… మెళుకువలు నేర్పింది.

గౌరవం నేర్పింది,నడవడిక నేర్పింది … బతుకు నేర్పింది.గురువుల్ని స్నేహితులను ఇచ్చింది మమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టింది.

నాటి నుంచి నేటి వరకు ఈ కార్యక్రమం మా కడుపులు నింపుతున్న అమ్మ లాంటిది.

ఈ కార్యక్రమం రూపొందించిన మల్లెమాల శ్యాం ప్రసాద్ రెడ్డి గారికి, మీ వరకు తీసుకువచ్చిన ఈటీవీ యాజమాన్యానికి,మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మమ్మల్ని ఈ స్థానంలో నిలబెట్టిన ప్రేక్షకులకు ధన్యవాదాలు మేము ఎక్కడున్నా మీ అభిమానాలు ఆదరణ మాపై ఉండాలంటూ ఈ సందర్భంగా గెటప్ శ్రీను జబర్దస్త్ కార్యక్రమం గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://www.facebook.com/photo.php?fbid=745169586967102&set=a.239744444176288&type=3
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube