జబర్దస్త్ ఆర్టిస్ట్ ల జబర్దస్త్ ఆలోచన! జనసేన తరుపున తప్పని ఎన్నికల ప్రచారం  

Jabardasth Show Artists Campaign For Janasena Party-

టెలివిజన్ కామెడీ షో జబర్ధస్ట్ తో ఎంతో మంది నటులు వెలుగులోకి వచ్చారు.ఒకప్పుడు అవకాశాల కోసం కృష్ణా నగర్ లో తిరిగిన వారికి జబర్దస్త్ టెలివిజన్ షో వేదికగా మారింది.

Jabardasth Show Artists Campaign For Janasena Party- Telugu Tollywood Movie Cinema Film Latest News Jabardasth Show Artists Campaign For Janasena Party--Jabardasth Show Artists Campaign For Janasena Party-

అవకాశాలు అందుకునేలా చేసింది.ఇప్పుడు ఇందులో రాణించిన చాలా మంది సినిమాలలో మంచి అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు.ఇక జబర్దస్త్ షో కి జడ్జ్ లుగా నాగబాబు, రోజా ఉన్నారు.రోజా వైసీపీ ఎమ్మెల్యే అనే విషయం అందరికి తెలిసిందే.ఇక తాజాగా నాగబాబు జనసేన తరుపున ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నారు.

అయితే ఇప్పుడు నాగబాబ ప్రోత్సాహంతో నటులుగా రాణిస్తున్న జబర్దస్త్ టీం ఆర్టిస్ట్ లు ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగమయ్యారు.

సినిమా ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు చాలా మంది ఏపీ ఎన్నికలలో భాగమయ్యారు.వారిలో పెద్ద పెద్ద నటులు వైసీపీ వైపు చూస్తూ, ఆ పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ సన్నిహితులు అని చెప్పుకున్నవారు కూడా ఇప్పుడు వైసీపీలో చేరి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారు.

అయితే జబర్దస్త్ ద్వారా నటులుగా ఎంట్రీ ఇచ్చిన వారు మాత్రం తమకి ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ తరుపున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.భవిష్యత్తులో సినిమా అవకాశాలు రావని వైసీపీకి చెందిన వారు భయపెడుతున్న జనసేన తరుపున వారంతా నిలబడటం విశేషం.మరో వైపు గబ్బర్ సింగ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న గబ్బర్ సింగ్ గ్యాంగ్ కూడా పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొని జనసేనాని మీద తమకి ఉన్న అభిమానం చాటుకుంటున్నారు.