జబర్దస్త్ లేడీ గెటప్ కంటెస్టెంట్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన శాంతి స్వరూప్?

జబర్దస్త్ లో ఒకప్పుడు మగవారు లేడీ గెటప్ వేసుకొని నటించేవారు.ఇది ఈ మధ్య కాలంలో జబర్దస్త్ షోలో లేడీ గెటప్ కంటే ఎక్కువగా లేడీస్ కనిపిస్తున్నారు.

 Jabardasth Shanti Swaroop Sensational Allegations On Lady Getup Artists Details,-TeluguStop.com

అలా లేడీ గెటప్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో కమెడియన్ శాంతి స్వరూప్ కూడా ఒకరు.శాంతి స్వరూప్ చాలాకాలం నుంచి జబర్దస్త్ లో లేడీ గెటప్ వేస్తూ వస్తున్నారు.

శాంతి స్వరూప్ తో పాటు లేడీ గెటప్ వేసిన కమెడియన్లు వేరే దారులు చేసుకున్నప్పటికీ శాంతి స్వరూప్ మాత్రం జబర్దస్త్ విడవలేదు.ఇదిలా ఉంటే తాజాగా శాంతిస్వరూప్ తన యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేసిన ఒక వీడియో సంచలనం రేపుతోంది.

ఆ వీడియోలో జబర్దస్త్ కంటెస్టెంట్స్ గురించి శాంతి స్వరూప్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

తన యూట్యూబ్ ఛానల్ ద్వారా 25 నిమిషాల నిడివి ఉన్న వీడియోని విడుదల చేశారు శాంతి స్వరూప్.

లేడీ గెటప్స్ వేసి పాపులారిటీ సంపాదించుకున్న ఒక వ్యక్తి సర్జరీ చేయించుకుని ట్రాన్స్ జెండర్ గా మారినట్లు తెలిపాడు.అయితే అలా ట్రాన్స్ జెండర్ గా మారడం, మారకపోవడం అనేది వారి వ్యక్తిగత విషయం అని చెబుతూనే జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసే వాళ్ళు అందరూ కూడా ఇలాంటి వాళ్లే అని అతను అంటున్నాడు అని శాంతి స్వరూప్ వెల్లడించాడు.

ఇక జబర్దస్త్ షో ద్వారా వచ్చిన క్రేజ్ ను ఉపయోగించుకొని సర్జరీ చేయించు కోవడమే కాకుండా సోషల్ మీడియాలో ఖాతాలు తెరిచి కొంత మందిని ట్రాప్ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని శాంతి స్వరూప్ చెప్పుకొచ్చాడు.

నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుతూ వారి స్క్రీన్ షాట్ తీసి బెదిరించిన దాఖలాలు కూడా తనకు తెలుసని ఇలా చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని శాంతి స్వరూప్ హెచ్చరించాడు.అతను అలా చేయడంతో జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసి అందరినీ చిన్నచూపు చూస్తున్నారని బాధపడ్డాడు శాంతి స్వరూప్. ఇలా జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్ తో నిజంగా ఫీలింగ్స్ లేకపోయినా సర్జరీ చేయించుకుని డబ్బు సంపాదనే ధ్యేయంగా అడ్డమైన పనులు చేయడానికి కూడా సిద్ధమవుతున్నాడు అంటూ ఆమె మీద ఆరోపణలు గుప్పించారు.

అయితే జబర్దస్త్ నుంచి సర్జరీ చేయించుకున్న వ్యక్తి అనగానే బిగ్ బాస్ ప్రియాంక గుర్తొస్తుందని,అయితే ప్రియాంక అలాంటి వ్యక్తి కాదని ఆమె పేరు ప్రస్తావించకుండా బిగ్ బాస్ లోకి వెళ్లి మంచి పేరు సంపాదించిన వ్యక్తి కాదని తెలిపాడు.శాంతి స్వరూప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube