ట్రాన్సజెండెర్ గా మారిన జబర్దస్త్ ఆర్టిస్ట్.! కారణం అదే..! చావు దగ్గరి వరకు వెళ్లి...చివరికి! నమ్మలేని నిజాలు.!  

  • జబర్దస్త్ ఈ పదానికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలిగింట ప్రతి నోట నానే మాట, ప్రతి టి.వి.లో వచ్చే ఆట. గురువారం, శుక్రవారం వచ్చిందంటే ఆ రోజు రాత్రి జబర్దస్గ్ షో టైం ఎప్పుడవుతుందా… ఈ రోజు ఎలాంటి స్కిట్ లు వస్తాయా అని ఎదురుచూసే ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు. అయితే జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసి ఎంతో మంది రాణిస్తున్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే…వినోద్, పవన్, సాయి తేజ, శాంతి స్వరూప్. అసలు వీరు బయట కూడా లేడీ గెటప్స్ లోనే ఉంటారా అని కొంతమందికి డౌట్ కూడా వస్తుంది.

  • ఈక్రమంలో జబర్దస్త్ షోలలో లేడీ గెటప్స్ వేసే సాయి తేజ ఇపుడు పూర్తిగా అమ్మాయిగా మారిపోయాడు.పేరును కూడా ప్రియాంక సింగ్‌గా మార్చుకున్నారు. ఆపరేషన్ ద్వారా ట్రాన్స్‌జెండర్‌గా మారాడు. ఈ విషయాలన్నీ తనే స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పారు. తనకు బై బర్త్ ఫీలింగ్స్ ఉండటం వల్లనే ఇలా మారిపోయానని తెలిపారు. అంతేకాని డబ్బులు ఎక్కువ వస్తాయని కాదు అని స్పష్టం చేసారు.

  • ఈ విషయం మా ఫ్యామిలీలో అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. మా నాన్నకి, బ్రదర్స్‌కు తెలియదు. ఎప్పటికైనా ఈ విషయం తెలియాల్సిందే. ఇది దాచుకుంటే దాగే విషయం కాదు. అందుకే ధైర్యంగా ఈ విషయాన్ని చెప్పడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు. నాకు 5 ఏళ్ల యవసులోనే ఈ ఫీలింగ్స్ మొదలయ్యాయి. మా సిస్టర్ స్కూలుకు వెళ్లేపుడు తను వేసుకునే డ్రెస్సులు వేసుకోవడం, వాళ్లలాగా తయారవ్వడం లాంటిది చేసేదాన్ని. అయితే స్కూల్ డేస్‌లో, కాలేజ్ డేస్‌లో నాలో ఈ ఫీలింగ్స్ ఉన్న విషయం కూడా బయట పెట్టలేదు. ఎందుకంటే అపుడు నాకు భయం. మా నాన్నగారికి ఊర్లో మంచి పేరుంది. ఆ భయంతోనే ఎవరికీ చెప్పలేదు.

  • Jabardasth Sai Teja Converted As Transgender-

    Jabardasth Sai Teja Converted As Transgender

  • అయితే ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత కూడా కొన్ని సమస్యలు వచ్చాయి. ఆరు నెలల క్రితం ట్రాన్స్‌జెండర్ ఆఫరేషన్ ద్వారా అమ్మాయిగా మారాను. ఈ నాలుగు నెలల్లో చావు దగ్గరకు వెళ్లాను, మళ్లీ బ్రతికాను. జెండర్ చేంజ్ తర్వాత ఆర్తరైటిస్ వచ్చింది. ఆ సమస్యకు ఓ పెద్ద ఆసుపత్రికి వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టాను. ఆ సమయంలో నా నలుగురు ఫ్రెండ్స్ అండగా ఉండటం వల్లనే నేను బ్రతికాను అని సాయి తేజ అలియాస్ ప్రియాంక సింగ్ తెలిపారు.